మ్యాజిక్ చేసిన అర్ష్‌దీప్.. ఓడిపోయే మ్యాచ్‌లో విజ‌యం సాధించిన భార‌త్

మ్యాజిక్ చేసిన అర్ష్‌దీప్.. ఓడిపోయే మ్యాచ్‌లో విజ‌యం సాధించిన భార‌త్

వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మి త‌ర్వాత భార‌త్ ఓదార్పునిచ్చే విజ‌యం సాధించింది. సొంత గ‌డ్డపై ఆస్ట్రేలియాని 4-1తేడాతో ఓడించి క‌ప్ అందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో ముఖేశ్ కుమార్(3/32), అర్ష్‌దీప్ సింగ్(2/40) అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో టీమిండియా ఆరు ప‌రుగుల తేడాతో విజయాన్నందుకుంది. ఆఖరి ఓవర్‌లో మంచి డ్రామా నెల‌కొంది. ఆసీస్ విజయానికి 10 ప‌రుగులు కావ‌ల్సి ఉడ‌గా, వేడ్ క్రీజ్ లో ఉండ‌డంతో ఆసీస‌న్ సునాయాసంగా గెలుస్తుంద‌ని అనుకున్నారు. కాని చివ‌రి ఓవర్ బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ 10 పరుగులు డిఫెండ్ చేయడమే కాకుండా.. మాథ్యూ వేడ్‌ను ఔట్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఐదో టీ20లో భార‌త్ ముందు బ్యాటింగ్ చేయ‌గా, య‌శ‌స్వి ఎప్ప‌టి మాదిరిగ‌నే పెద్ద స్ట్రోక్స్ ఆడుతూ స్కోర్ బోర్డ్‌ని ప‌రుగులెత్తించాడు. అయితే చెత్త షాట్ వ‌ల‌న అత‌ను తొంద‌ర‌గా పెవీలియ‌న్ చేరుకున్నాడు. య‌శ‌స్వి త‌ర్వాత రుతురాజ్, సూర్య‌కుమార్, రింకూ తొంద‌ర‌గానే ఔటైన శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) అతనికి అండగా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ కి తలో వికెట్ ద‌క్కింది.

ఇక స్ప‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్‌డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు అంద‌రు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) మెరుపులు మెరిపించిన కూడా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా లేకపోయింది. మ‌రోసారి స్పిన్న‌ర్స్ ర‌వి బిష్ణోయ్, అక్ష‌ర్ ప‌టేల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు ద‌క్కాయి. ఇక అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. మొత్తానికి సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలోని భార‌త యువ జ‌ట్టు ఆస్ట్రేలియాపై అద్భుతంగా గెలిచి సిరీస్ ద‌క్కించుకుంది.