నాలుగో టీ20లో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన భార‌త్.. సిరీస్ ఇండియా కైవ‌సం

నాలుగో టీ20లో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన భార‌త్.. సిరీస్ ఇండియా కైవ‌సం

వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మికి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా మూడు టీ20లు గెలిచి సిరీస్ ద‌క్కించుకుంది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భార‌త్‌ సమష్టిగా రాణించ‌డంతో ఆస్ట్రేలియాపై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.మ్యాచ్‌లో టాస్ గెలిచి భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది భార‌త్.. దీంతో భార‌త్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) మంచి స్కోరు సాధించారు. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంతా త‌క్కువ స్కోరుకే వెనుదిరిగారు.

త‌క్కువ స్కోరుని భార‌త్ కాపాడుకుంటుందా లేదా, ఆస్ట్రేలియా హిట్ట‌ర్స్‌కి అడ్డుక‌ట్ట వేస్తుందా లేదా అని అంద‌రిలో సందేహాలు నెల‌కొని ఉండ‌గా, స్పిన్నర్స్ ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌కి చెక్ పెట్టారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్ర‌మే చేసింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిల‌వ‌గా, భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో విశ్వవిజేత ఆస్ట్రేలియాను భార‌త్ కంగు తినిపించింది.

నాలుగో టీ20లో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన భార‌త్.. సిరీస్ ఇండియా కైవ‌సంట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది ఆస్ట్రేలియా . ఈ పరిస్థితుల్లో రవి బిష్ణోయ్‌ను రంగంలోకి దింపిన సూర్యకుమార్ యాదవ్ మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టాడు. జోష్ ఫిలిప్పీ(8)ని బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ట్రావిస్ హెడ్(31)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేయ‌డంతో పవర్ ప్లేలో ఆసీస్ 2 వికెట్లకు 52 పరుగులు చేసింది.ఆ త‌ర్వాత భార‌త బౌల‌ర్లు విజృంభించి కీల‌క వికెట్స్ ప‌డ‌గొట్టారు. మొద‌ట్లో భారీగా ప‌రుగులు ఇచ్చిన చాహ‌ర్ చివ‌రలో పొదుపుగా బౌలింగ్ చేసి రెండు కీల‌క వికెట్స్ తీసుకున్నాడు. ఇక చివ‌రి టీ20 డిసెంబ‌ర్ 3న జ‌ర‌గ‌నుంది.