ఘట్‌కేసర్ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
ఘట్‌కేసర్‌లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయలో 2024-25 విద్యాసంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

మేడ్చల్ మల్కాజ్‌గిరి : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయలో 2024-25 విద్యాసంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు.
పీజీటీ పోస్టుల కింద హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, టీజీటీ పోస్టుల కింద హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్, సోషల్ సైన్స్, సైన్స్, పీఆర్టీ కింద కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్, కోచ్, అకడమిక్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, డిప్లొమా లేదా పీజీ డిప్లొమా చేసి ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఘట్‌కేసర్‌లోని కేవీలోనే ఇంటర్వ్యూలను 15వ తేదీన నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://ghatkesarnfc.kvs.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.