IT Rides | హైదరాబాద్‌లో ఐటీదాడుల కలకలం.. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు..!
IT Rides | హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్ సోదాలు కలకం సృష్టిస్తున్నాయి. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వండర్ సిటీ, ఫార్మా హిల్స్, రాయల్ సిటీ కంపెనీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌లోని 20 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వసుధ ఫార్మా […]

IT Rides | హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్ సోదాలు కలకం సృష్టిస్తున్నాయి. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వండర్ సిటీ, ఫార్మా హిల్స్, రాయల్ సిటీ కంపెనీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌లోని 20 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ నెల ప్రారంభంలో వసుధ ఫార్మా కంపెనీల్లో ఐటీ అధకారులు సోదాలు జరిపారు. గత నెలలోనూ హైదరాబాద్‌లోని నాలుగు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు జరిపింది. ఎస్సార్‌నగర్‌లోని వసుధ సంస్థ ప్రధానకార్యాలయంతోపాటు మాదాపూర్, జీడిమెట్లలోని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపారా లావాదేవీలు, ఆదాయపన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.