ఝాన్సీ మేనేజ‌ర్ మృతి.. 35 ఏళ్ల‌కే చ‌నిపోవ‌డంతో హృద‌యం బ‌ద్ధ‌లైందంటూ పోస్ట్

ఝాన్సీ మేనేజ‌ర్ మృతి.. 35 ఏళ్ల‌కే చ‌నిపోవ‌డంతో హృద‌యం బ‌ద్ధ‌లైందంటూ పోస్ట్

తెలుగు సినీ ప్రేక్ష‌కులకి యాంక‌ర్ ఝాన్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను ఝాన్సీ ఎంత‌గానో అల‌రించింది. ఇటీవలే ఆమె నాని దసరా చిత్రంలో ఎమోషనల్ గా నటించి ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. కామెడీని పండించ‌డంతో పాటు గ‌య్యాళిగాను ఝాన్సీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. కెరీర్‌గా బాగానే ఉన్నా కూడా ప‌ర్స‌న‌ల్ లైఫ్ డిస్ట్ర‌బ్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జోగి నాయుడికి విడాకులు ఇచ్చి ఇప్పుడు సోలోగా ఉంటుంది. ఝాన్సీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తుంటుంది. తాజాగా ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా గుండె ప‌గిలే విష‌యం చెప్పింది.

చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల కార్యక్రమాలన్నింటినీ డిసైడ్ చేసేది, చూసుకునేది మేనేజర్లే. సెల‌బ్రిటీలకు, మేనేజర్లకు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే తాజాగా ఝాన్సీ త‌న మేనేజ‌ర్ ని కోలంపోయింది. మేనేజ‌ర్ శ్రీను (35) గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. దీనితో ఝాన్సీ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అత‌ను మ‌ర‌ణించాడ‌ని క‌న్నీరు కూడా పెట్టేసుకుంది. శ్రీను.. సీను బాబు.. అని నేను అత‌నిని ముద్దుగా పిలుస్తాను.. అతనే నా సపోర్ట్ సిస్టమ్.. హెయిర్ స్టైలిష్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. నా పర్సనల్ సెక్రటరీగా మారాడు.. నా పనులన్నింటిని చ‌క్క‌గా చూసుకున్నాడు.. అతనే నా రిలీఫ్.. నన్ను బ్యాలెన్స్‌గా ఉంచ‌డంలో అత‌ని పాత్ర ఎంతో ఉంది.

శ్రీను నా బలం.. ఎంతో మంచి వాడు.. దయాగుణం కలవాడు.. ఎంతో నవ్విస్తాడు.. అతను నా స్టాఫ్‌గా నా కుటుంబ సభ్యుడు, నా సోదరుడిగా క‌న్నా కూడా ఎక్కువ‌. 35 ఏళ్ల‌కే ఇలా గుండెపోటుతో క‌న్నుమూయ‌డం నన్ను షాక్‌కి గురి చేసింది. శ్రీనుని చూస్తే జీవితం అనేది ఓ నీటి బుడగలాంటిది అని అర్ధ‌మైందంటూ ఎమోషనల్ అయింది. ఝాన్సీ పోస్ట్‌కి ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. ..మీకు జరిగిన నష్టానికి సారీ, ఓం శాంతి అంటూ అడివి శేష్ కామెంట్ చేశాడు. సో స్యాడ్ అంటూ సురేఖా వాణి, ధైర్యంగా ఉండు అక్కా అని వింధ్యా విశాఖ.. ఓం శాంతి అంటూ ప్రగతి, చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది.. చాలా దారుణం.. ఆయన చాలా మంచి మనిషి.. నా కెరీర్ ప్రారంభంలోనూ ఆయన నాతో ఉన్నారు. జీవితం అనేది ఊహాతీతం అంటూ గాయ‌త్రి భార్గ‌వి కామెంట్స్ చేశారు.