Kajal Aggarwal | మనసులో మాట బయటపెట్టిన టాలీవుడ్ చందమామ..! కాజల్ అగర్వాల్‌కు ఆ హీరో అంటేనే ఇష్టమట..!

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ‘భగవంత్ కేసరి’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విశ్రాంతి ఇచ్చిన కాజల్.. ప్రస్తుతం మంచి అవకాశాలను సొంతం చేసుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగులో ‘సత్యభామ’ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంలో తన ఫేవర్ హీరో ఎవరో చెప్పింది. టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ఎన్టీఆర్‌తో నటించడం తనకు ఎంతో ఇస్టమని తెలిపింది. ఎన్టీఆర్‌కు జంటగా కాజల్ ‘బృందావనం’, ‘బాద్‌షా’, ‘టెంపర్’ సినిమాల్లో నటించింది. జనతా గ్యారేజ్ చిత్రంలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఇక తమిళంలో విజయ్ దళపతి అభిమాన హీరో అని తెలిపింది.
కాజల్ అగర్వాల్ 2003లో బాలీవుడ్ ‘క్యూన్‌లో’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. 2007లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంలో నటించింది. అదే ఏడాది వచ్చిన ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామగా మారింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రం కెరీర్‌ను మలుపు తప్పింది. ఆ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజతో పాటు పలువురు హీరోల సరసన నటించింది. తనతో పాటు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఇప్పటికే ఫేడవుట్ కాగా.. కాజల్ మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నది. ఇక 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి నీల్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం కాజల్ ఇండియన్-2, ఉమ, సత్యభామ చిత్రాల్లో నటిస్తున్నది.