అన‌సూయ‌, ర‌ష్మీ గురించి కిరాక్ ఆర్పీ అలా అనేశాడేంటి..!

అన‌సూయ‌, ర‌ష్మీ గురించి కిరాక్ ఆర్పీ అలా అనేశాడేంటి..!

జ‌బ‌ర్ధ‌స్త్ వీక్షించిన వారికి కిరాక్ ఆర్పీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని తెగ అల‌రించిన కిరాక్ ఆర్పీ ఈ మ‌ధ్య నెల్లూరు చేప‌ల పులుసుతో బాగా వార్త‌ల‌లోకి ఎక్కాడు. ఆయ‌న పెట్టిన నెల్లూరు చేప‌ల పులుసు ఫ్రాంచైజీల‌కి మంచి డిమాండ్ రావ‌డంతో ఆర్పీ పేరు మారు మ్ర‌గింది. ఇక ఈయ‌న ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కాడు. జ‌బ‌ర్ధ‌స్త్ గురించి, మ‌ల్లెమాల గురించి ఆర్పీ స్ట‌న్నింగ్ కామెంట్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్, యాంకర్స్, జడ్జెస్ గురించి తన అభిప్రాయం చెప్పాలని కిరాక్ ఆర్పీ త‌న అభిప్రాయాలు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

రష్మీ గురించి చెప్పిన కిరాక్ ఆర్పీ.. రష్మీ అప్పటి వరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్ అని, ఆమెకు తెలుగు సరిగా రాక‌పోయిన కూడా తనకొచ్చిన స్లాంగ్ తో సక్సెస్ అయ్యింది అని తెలిపాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులు ర‌ష్మీ మార్చేసింది. ఆమె తెలుగు బదులు తెగులు అన్నా కూడా నవ్వుకుంటాం అని ఆర్పీ స్ప‌ష్టం చేశాడు. ఇక అన‌సూయ గురించి మాట్లాడుతూ.. యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్స్ తో తన స్థాయిని పెంచుకుంది. ఆమెకు సినిమాలకు కూడా బాగా సూట్ అయ్యాయి అంటూ కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక సుడిగాలి సుధీర్ మల్టీ టాలెంటెడ్ అని, గెటప్ శ్రీను కమల్ హాసన్ అని, రామ్ ప్రసాద్ ఆటో డైలాగ్స్ కి ఫేమస్ అంటూ… వారి గురించి గొప్ప‌గానే కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. కాగా జబర్దస్త్ మానేసిన కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం చేస్తునే లక్షలు సంపాదిస్తున్నాడు. అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా చాటాల‌ని అనుకున్నాడు. కాని ఎందుకో మ‌ధ్య‌లోనే ఆ ప్రాజెక్ట్ వ‌దిలేశాడు. రానున్న రోజులలో అయిన ఆర్పీ త‌న న‌ట‌న‌తోనో లేదంటే ద‌ర్శ‌క‌త్వంతో అల‌రించాల‌ని భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.