నాభి అందాలు చూపిస్తూ కృతి శెట్టి బెల్లి డ్యాన్స్..రోజురోజుకి హద్దులు చెరిపేస్తున్న ముద్దుగుమ్మ

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడచక్కని అందంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ భామ. ఉప్పెన సినిమాలో కృతి పర్‌ఫార్మెన్స్‌కి ఆమె వెంట ఆఫర్స్ క్యూ కట్టాయి. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో మరో రెండు విజయాలు అందుకొని హ్యాట్రిక్ సాధించింది. అయితే బంగార్రాజు చిత్రం ఈ అమ్మడికి చివరి హిట్ మూవీగా నిలిచింది. తర్వాత వరుసగా మూడు, నాలుగు ఫ్లాపులు రావడంతో గోల్డెన్ బ్యూటీ కాస్త ఐరెన్ లెగ్‌గా మారింది. ప్రస్తుతం కృతికి తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవనే చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మడు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా మారింది.
కృతి శెట్టికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ అమ్మడు ఎవరినో పెళ్లి చేసుకుంటుందని, లేదంటే స్టార్ హీరో ఫ్యామిలీకి కోడలిగా వెళుతుందని కృతి గురించి ఏవేవో వార్తలు రాస్తూనే ఉంటారు.వాటిని కృతి పెద్దగా పట్టించుకోదు. అయితే ఇటీవలి కాలంలో కృతి శెట్టి అందాల డోస్ బాగా పెంచింది. మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ భామ ఇప్పుడు మాత్రం ఏకంగా అందాల ఆరబోతతో కుర్రకారు మనసులు దోచుకుంది. కేక పెట్టించే అందాలతో అందరు మతిపోగొట్టేలా చేస్తుంది. కృతి శెట్టిని అలా చూసి నిజంగా ఈ అమ్మడు ఇలా మారిందేంటని అనుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బెల్లీ డాన్స్ తో మతులు పోగొట్టింది అని చెప్పాలి.. ఫస్ట్ టైమ్ నడుమును బొంగరంలా తిప్పుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ‘బీస్ట్’లోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేయగా కృతి శెట్టి టాలెంట్‌తో పాటు ఆమె నడుము అందం, నాభీ సొగసును చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఇంతకముందు కన్నా మరింత నాజూగ్గా కృతి తయారైందని, కేక పెట్టించేలా కృతి శెట్టి ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కృతి తమిళంలో వా వాతియారే,జెన్నీతో పాటు ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’ వంటి సినిమాలు చేస్తుంది. తెలుగులో ‘శర్వా35’, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది