హోటల్‌లో నిర్మాతతో అడ్డంగా దొరికిన ఆదిపురుష్ హీరోయిన్..అలా చేసిందేంటి?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో కథానాయికగా నటించింది కృతి సనన్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కృతి సనన్ బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపే దక్కించుకుంది. ‘దోచేయ్’, ‘వన్ నేనొక్కడినే’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో సందడి చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్‌లోనే నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో సందడి చేస్తున్న ఈ అమ్మడు రీసెంట్ గానే టైగర్ ష్రాఫ్ సరసన నటించింది. ‘థేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’తో ప్రేక్షకులని అలరించింది. ఇక ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది కృతి సనన్.
ఇక కృతి సనన్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృతి సనన్ తన కొత్త చిత్రం ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ ప్రమోషన్‌లో భాగంగా వెరైటీ డ్రెస్సులో కనిపిస్తూ నానా రచ్చ చేసింది. బోల్డ్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ కృతి సనన్ చేసిన రచ్చకి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్‌తో హోడ్ లైన్స్‌లో నిలుస్తూ ఉంటుంది. కృతి సనన్ కొన్నిసార్లు ట్రెడిషనల్ లుక్‌లో, మరికొన్నిసార్లు తన ఆకర్షణీయమైన శైలిలో, అలాగే ఇంకొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కృతి సనన్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తుంది.
కృతి సనన్ ఓ నిర్మాతతో హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందని ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అయితే ఈ వార్తని సృష్టించింది మరెవరో కాదు ఉమైర్ సంధు. మనోడు సెలబ్రిటీలకి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో కృతి సనన్..థేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’మూవీ ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత దినేష్ విజయన్‌తో కలిసి దుబాయ్ వెళ్లింది. అక్కడ ఓ హోటల్ రూమ్‌లో వీరిద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో నిర్మాత భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మొదట్లో కృతిని ఆ నిర్మాత తన సినిమాలో ఎందుకు హీరోయిన్‌గా తీసుకున్నాడో అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధమైంది అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఉమైర్ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇతగాడిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.