ప్రేయసి పేరును అక్కడ పచ్చబొట్టు వేయించుకున్న ప్రియుడు.. వీడియో
ఓ ప్రేమికుడు కూడా తన ప్రేయసికి వినూత్నంగా ప్రేమను వ్యక్తపరిచాడు. ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రేమికుడు తన కింది పెదవి లోపల తన ప్రియురాలి పేరును టాటూగా వేయించుకున్నాడు.

ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా బహుమానాలు ఇస్తుంటారు. అంతేకాదు.. కొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. ప్రాణాలను కూడా ఫణంగా పెడుతారు ఇంకొందరు ప్రేమికులు. ఇటీవలి కాలంలో చాలా మంది ప్రేమికులు తమ లవర్స్ పేరును శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. ఇది ట్రెండ్‌గా మారిపోయింది.
ఓ ప్రేమికుడు కూడా తన ప్రేయసికి వినూత్నంగా ప్రేమను వ్యక్తపరిచాడు. ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రేమికుడు తన కింది పెదవి లోపల తన ప్రియురాలి పేరును టాటూగా వేయించుకున్నాడు. అమృత అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను టాటూ ఆర్టిస్ట్ అభిషేక్ సప్కల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో పోస్టు చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 9 మిలియన్ల మంది వీక్షించారు. క్రేజీ అని చాలా మంది రాయగా, ఇది వెర్రితనం అని మరికొందరు కామెంట్లు చేశారు.