వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పక్క షాపులకు అంటుకున్న మంటలు
పాత ఫర్నిచర్ దుకాణాల్లో మంటలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వరంగల్ ఇసుక అడ్డా సాకరాసి కుంట జంక్షన్ రాజ శ్రీ గార్డెన్ పరిసరాల్లో ఉన్న పాత ఫర్నీచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. గమనించిన స్థానికులు పోలీస్ లకు, ఫైర్ సిబందికి సమాచారం ఇచ్చారు. ఒక షాపు ను oచి మరో షాపుకు మంటలు విస్తరించాయి. ఇక్కడ […]

- పాత ఫర్నిచర్ దుకాణాల్లో మంటలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వరంగల్ ఇసుక అడ్డా సాకరాసి కుంట జంక్షన్ రాజ శ్రీ గార్డెన్ పరిసరాల్లో ఉన్న పాత ఫర్నీచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి.
గమనించిన స్థానికులు పోలీస్ లకు, ఫైర్ సిబందికి సమాచారం ఇచ్చారు. ఒక షాపు ను oచి మరో షాపుకు మంటలు విస్తరించాయి. ఇక్కడ పదుల సంఖ్యలో పాత ఫర్నిచర్ దుకాణాలు, గోడౌన్‌లు ఉన్నాయి.
వీటిల్లో పాత కర్ర సామాన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. కర్ర కావడంతో మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయి. ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకొని మంటలు అదుపులోకి తెస్తున్నారు. ఆస్తినష్టంతో పాటు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.