పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్.. కొత్త జంట‌తో మెగా హీరోలు..స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప‌వ‌న్ స‌తీమ‌ణి

పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్.. కొత్త జంట‌తో మెగా హీరోలు..స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప‌వ‌న్ స‌తీమ‌ణి

దాదాపు ఐదారేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఎట్ట‌కేల‌కి పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని టుస్కాని వేదిక‌గా నవంబర్ 1న రాత్రి 7:18 నిమిషాలకు వేద‌ మంత్రాల సాక్షిగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌రిగింది. మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీల స‌మ‌క్షంలో త‌న ప్రేయ‌సి మెడ‌లో మూడు ముళ్లు వేసాడు వ‌రుణ్ తేజ్. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక సంద‌డిగా సాగింది. ఇక‌ టాలీవుడ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తున్న మెగా హీరోలంతా ఈ పెళ్లి వేడుక‌లో ఒక్క చోట సందడి చేశారు. దాదాపు 10 మంది హీరోలు ఈ ఈవెంట్ లో ఒకే చోట కనిపించడం విశేషం.

కొత్త జంట‌తో క‌లిసి చిరు నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుంటే మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. చాలా రోజుల త‌ర్వాత మెగా హీరోలంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు మ‌రోవైపు మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అంతా కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ గా మారింది. ఇందులో ప‌వ‌న్ స‌తీమ‌ణి కూడా క‌నిపిస్తుంది. చీర‌క‌ట్టులో సురేఖ ప‌క్క‌న కూర్చొని క్యూట్ స్మైల్‌తో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకుంది. ఈ పిక్ కూడా నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. అయితే అందరు హీరోలు కూడా చాలా కాస్ట్‌లీ దుస్తులు ధ‌రించి డిఫ‌రెంట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌గా, ప‌వ‌న్ మాత్రం సింపుల్‌గా క‌నిపించి సంద‌డి చేశాడు.

ఇక ఈ పెళ్లి వేడుక‌లో మెగాస్టార్ తన సతీమణితో కలసి క్లింకారను ముద్దు చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మ‌రోవైపు అల్లు వారి పిల్లలు.. ఈ వెంట్ లో ఆధ్యంతం సందడి చేశారు వారు. అల్లు అర్జున్ కూడా తన వారసులు అల్లు అయాన్ తో కలిసి ఓసరదా సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫోటోలో దూరంగా తన భార్య స్నేహా రెడ్డి కూడా కనిపించారు. ఈ పిక్ ను తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేశాడు అల్లు అర్జున్. ఈ పిక్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. మ‌రోవైపు ఈవెంట్‌లో మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ తో పాటు.. యంగ్ హీరో నితిన్ కూడా సంద‌డి చేసాడు.