ఏంటి న‌భా ఈ విర‌హం.. అందాల‌తో నిషా ఎక్కిస్తున్నావుగా..!

ఏంటి న‌భా ఈ విర‌హం.. అందాల‌తో నిషా ఎక్కిస్తున్నావుగా..!

చాలా తక్కువ సినిమాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. చాలా తక్కువ సినిమాల్లోనే నటించినా ఈ బ్యూటీ క్రేజ్ పెరుగుతూనే ఉందంటే అందుకు కార‌ణంగా ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టించ‌డ‌మే. కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్లకి మ‌తులు పోయేలా చేస్తుంటుంది. కర్నాటకకు చెందిన నభా నటేష్ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించింది. ‘వజ్రకాయ’ అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత కూడా శాండిల్‌వుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. అనంత‌రం ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో నభా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నిరాశ‌ప‌ర‌చింది.

అనంతరం ‘అదిగో’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా త‌ర్వాత నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో క‌థ‌నాయిక‌గా చేసింది. ఇందులో న‌భా న‌టేష్ మాస్ లుక్‌లో కనిపించి పిచ్చెక్కించింది. ఈ క్రేజీ సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. ఇస్మార్ట్ శంకర్’ తర్వాత కూడా నభా నటేష్‌కి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. ఈ అమ్మ‌డు మంచి క‌థ‌ల‌ని ఎంచుకోకుండా అన్నింటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ వంటి చిత్రాల్లో న‌టించ‌గా, ఈ మూడింట్లో ఒక్క‌టి కూడా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో న‌భాకి అవ‌కాశాలు కరువ‌య్యాయి. ఇక సినిమాలు లేక‌పోతేనేం సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ చేస్తూనే ఉంది.

బార్బీ గర్ల్ అంటూ కెమెరా ముందు అందాల విందు చేసింది నభా నటేష్. చెవిలో పువ్వు పెట్టుకొని , అటు ఎద అందాలు, ఇటు థైస్ షో చేస్తూ కవ్వించింది ఈ బ్యూటీ. ఈ పిక్స్ చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ‘ఆఫర్లు కావాలంటే ఈ మాత్రం చూపించాలిలే’, ‘ఎందుకు నీకే ఆఫ‌ర్స్ రావడం లేదూ ‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె పరువాలను ప్రశంసిస్తూ సపోర్టుగా రిప్లైలు ఇస్తున్నారు.ఎవ‌రు ఎన్ని అన్నా కూడా న‌భా అందాల ఆర‌బోత‌లో త‌గ్గేదేలే అంటుంది.