WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డెస్క్‌టాప్‌లోనూ లాక్‌ చాట్‌ ఫీచర్‌..!

యాప్‌లో లాక్‌ చేసిన చాట్‌లను వెబ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా సీక్రెట్‌ కోడ్‌ అవసరమయ్యేలా సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకురాబోతున్నది.

WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డెస్క్‌టాప్‌లోనూ లాక్‌ చాట్‌ ఫీచర్‌..!

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కి పరిచయం చేస్తుంటుంది. దాంతో పాటు యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ వస్తున్నది. తాజాగా కంపెనీ మరో సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకువస్తున్నది. యాప్‌లో లాక్‌ చేసిన చాట్‌లను వెబ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా సీక్రెట్‌ కోడ్‌ అవసరమయ్యేలా సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకురాబోతున్నది.


ఇటీవల మొబైల్‌ వెర్షన్‌లో తీసుకొచ్చిన ‘లాక్‌ చాట్’ ఫీచర్‌ను వెబ్‌ వెర్షన్‌కు సైతం తీసుకురాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లు అందరికీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లాక్‌ చేసిన చాట్‌లను వాట్సప్‌ వెబ్‌ ఓపెన్‌ చేయాలంటే తొలుత సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో వ్యక్తిగత, రహస్య సమాచారం ఇతరులు చూడకుండా ఉంటుంది. అయితే, ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే వారికి ఎంతో ఉపయోకరంగా ఉండనున్నది. ఒక వేళ పొరపాటున లాగ్‌ అవుడ్‌ చేయడం మరిచినా సీక్రెట్‌ చాట్స్‌ను ఎవరూ చూడకుండా ఈ లాక్‌ చాట్‌ ఉపయోగపడుతుంది. త్వరలోనే వాట్సాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను యాడ్‌ చేయనున్నట్లు సమాచారం. వాట్సాప్‌లో లాక్‌ ఛాట్‌ను మెటా కంపెనీ మరింత తేలిగ్గా మార్చేంది. ఇకపై ప్రత్యేకంగా సెటింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాక్‌ చేయాలనుకున్న చాట్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి ‘లాక్‌ చాట్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.