మరో మల్లీప్లెక్స్‌కి మహేష్ బాబు ప్లాన్.. ఈ సారి ఎక్కడో తెలిస్తే అవాక్కవుతారు…!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్ బాబు త్వరలో రాజమౌళితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ కావడం ఖాయం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా, అతి త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు యాడ్స్, ఇతర బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. గచ్చిబౌలిలో ఏషియన్‌తో కలిసి ఏఎంబీ అనే మల్టీప్లెక్స్ స్థాపించాడు మహేష్. ఇది ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.
దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో కూడా ఒక మల్టీ ప్లెక్స్ కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. ఏఎమ్‌బీ క్లాసిక్ అనే పేరుతో ఈ మల్టీప్లెక్స్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. 14 ఏళ్ళ క్రితం మూతపడిన సుదర్శన్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ని ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఆర్టీసి క్రాస్ రోడ్ ఏరియాలో సినిమాలకు ఉన్న హడావుడి ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి స్థలంలో ఓ మల్టీ ప్లెక్స్ నిర్మిస్తే మహేష్ లాభాల బాటలో నడవడం ఖాయంగా చెబుతున్నారు. సుదర్శన్ థియేటర్‌ని లీజుకు తీసుకొని హేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండేలా మల్టీ ప్లెక్స్ నిర్మించబోతున్నట్టు టాక్.
దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావలసి ఉంది. కరోనా సమయంలో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. అవి ఇప్పుడు తరిగి మల్టీప్లెక్స్‌లుగా మారుతున్న నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో కూడా ఓ మల్టీప్లెక్స్ రావడం ఖాయమని పక్కాగా చెబుతున్నారు. ఇందులో మహేష్ బాబు సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేయడం ఖాయం.