ఆంధ్రాలో నా ఓటు గల్లంతైంది.. అక్కడ ఇల్లు తీసుకుంటామంటూ నిహారిక ఆసక్తికర కామెంట్స్

మెగా డాటర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకొని అతని నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తుంది. ఆమె మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో చేసే రచ్చతో నిత్యం వార్తలలో నిలుస్తుంది నిహారిక. అయితే విడాకుల తర్వాత నిహారికపై ఎక్కువగా నెగెటివిటీ నడుస్తుంది. అయితే తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా తను పట్టించుకోను అంటుంది.నాన్న చెప్పే మాటలు తనకు కొండంత ధైర్యం ఇస్తాయని ఎవరెన్ని మాటలు మాట్లాడిన పెద్దగా పట్టించుకోనని అంటుంది నిహారిక.
ఇక నిహారిక ఈ మధ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆమెకి అనేక ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతుండగా,దానికి నిహారిక షాకింగ్ సమాధానాలు ఇస్తుంది. బాబాయ్ పొలిటికల్ యాక్టివిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని తాజా ఇంటర్వ్యూలో నిహారికని ప్రశ్నించగా, దానికి సమాధానం ఇచ్చిన ఈ భామ జనసేన పార్టీ ఈ సారి మంచి విజయం సాధించాలని నేను ప్రార్ధిస్తున్నాను అని నిహారిక పేర్కొంది. నాకు ఆంధ్రాలో ఓటు ఉండేది. అయితే దానిని ఎందుకు రద్దు చేశౄరో నాకు తెలియదు. మేము ఆంధ్రాలో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాం. నాన్న పోటీ చేయడం పక్కా అయితే ఇల్లు తప్పక తీసుకుంటామని నిహారిక తెలియజేసింది.
నాన్న రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఇంటికి రెండు వారాలకొకసారి వచ్చి వెళ్లిపోతున్నారు. మట్లాడే టైం కూడా లేదు. బలవంతంగా మాట్లాడిఏస్తే మాట్లాడుతున్నారు. పార్టీ విషయాలు గురించి అడిగితే.. బాబాయ్ చాలా కష్టపడుతున్నారంటూ నాన్న అంటున్నారు. పార్టీ లీడర్ మాదిరిగా కాకుండా అన్నయ్యలా నాన్న ఆలోచిస్తున్నారు అని నిహారిక చెప్పింది.నేను చిన్నదానిని అయిన కూడా నాకు తెలిసింది చెబుతా. బాబాయి ఇప్పుడే కాదు ఎప్పటి నుండో ప్రజల మనిషి. తన చుట్టూ ఉన్నవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని తపన పడుతుంటాడు. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వారు ఎవరూ నష్టపోకూడదు అని ఆలోచిస్తుంటారు. బాబాయి లాంటి రాజకీయాలలో ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని నిహారిక పేర్కొంది.