రిసెప్ష‌న్‌లో అలా, కాక్‌టెయిల్ పార్టీలో ఇలా.. నిహారిక గ్లామ‌ర్ డోస్ పీక్స్‌లోనే..!

రిసెప్ష‌న్‌లో అలా, కాక్‌టెయిల్ పార్టీలో ఇలా.. నిహారిక గ్లామ‌ర్ డోస్ పీక్స్‌లోనే..!

ప్ర‌స్తుతం మెగా ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొన్న విష‌యం వెలిసిందే. అక్టోబ‌ర్ 30 నుండి వారింట పెళ్లి హంగామా క‌నిపిస్తుంది. చాలా రోజుల త‌ర్వాత వ‌రుణ్ – లావ‌ణ్య‌ల పెళ్లి కోసం మెగా కుటుంబ స‌భ్యులు అంద‌రు క‌లిసారు. సంతోషంగా గ‌డిపారు. పెళ్లిలో భాగంగా ఇటలీకి వెళ్లిన వీరంతా అక్క‌డ తెగ సంద‌డి చేస్తూ ప‌లు ఫొటోల‌కి కూడా పోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఆ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.అయితే అక్టోబర్ 30వ తేదీ రాత్రి కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేయ‌గా, పార్టీ కల్చర్ కి తగ్గట్లు అంద‌రు కూడా స్టైలిష్ దుస్తులు ధరించారు. పెళ్లి కొడుకు సిల్వర్ కలర్ వరుణ్ టక్సేడో సూట్ ధరించ‌గా, పెళ్లి కూతురు లావణ్య త్రిపాటి సిల్వర్ కలర్ ఫ్రాక్ ధరించింది.

ఇక ఈ పార్టీకి అంద‌రు వైట్ అండ్ సిల్వర్ కలర్ థీమ్ ఫాలో కాగా, మెగా డాట‌ర్ నిహారిక కూడా అదే ఫాలో అవుతూ ఖరీదైన డిజైనర్ వేర్ ధరించింది. చీరను పోలిన సదరు ట్రెండ్ వేర్ నిహారిక గ్లామర్ ని రెట్టింపు చేసింది అని చెప్పాలి. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్నెస్ కి తెరలేపిన ఈ అమ్మ‌డు త‌న క్యూట్ పిక్స్‌తో అంద‌రిని ఆక‌ర‌ర్షిస్తుంది. కాక్‌టెయిల్ పార్టీలో ధరించిన డ్రెస్‌కి సంబంధించిన పిక్స్ నిహారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అవి కూడా తెగ వైర‌ల్ అవుతున్నాయి. నిహారిక గ్లామర్ షో చూసిన జనాలు… విడాకుల త‌ర్వాత అందాల విందులో అమ్మడు హద్దులు చెరిపేశారని కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా రిసెప్ష‌న్ వేడుక‌లో కూడా నిహారిక క్లీవేజ్ షోతో కాక రేపింది. వైట్ ట్రెండీవేర్‌లో అమ్మ‌డి అందాల‌న్నీ బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇక నిహారిక విష‌యానికి వ‌స్తే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి కాగా, ఈ అమ్మ‌డు ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది. సినిమాల ప‌రంగా నిహారిక‌కి క‌లిసి రాక‌పోవ‌డంతో 2020లో పెద్దలు కుదిర్చిన సంబంధం వెంకట చైతన్యతో వివాహం చేసుకుంది. కొన్ని రోజులు బాగానే ఉన్నా త‌ర్వాత వ‌చ్చిన మనస్పర్థలతో నిహారిక-వెంకట చైతన్య విడిపోయారు. ఈ ఏడాది విడాకుల ప్రకటన చేయ‌గా, ఈ విష‌యం అంత‌టా హాట్ టాపిక్ అయింది. విడాకుల త‌ర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగా, నిర్మాతగా ఎదగాలని ఆమె క‌ల‌లు కంటుంది.