టాలీవుడ్‌లో మరోసెలబ్రిటీ పెళ్లి.. కాబోయే వరుడిని పరిచయం చేసిన పవిత్ర

టాలీవుడ్‌లో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. సమయం, సందర్భం చూసుకొని ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సినిమా స్టార్స్‌తో పాటు బుల్లితెర నటీనటులు కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ నటి లవ్ మ్యారేజ్‌కి సిద్ధమైనట్లు తెలిపింది. జబర్దస్త్ నటి పవిత్ర సంతోష్ ఓ యువకుడితో కొంతకాలం నుంచి ప్రేమలో ఉండగా, ఇప్పుడు అతనితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. తన ప్రియుడు సంతోష్ తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేసిన పవిత్ర.. ఈ రోజు నా జీవితంలో ఎంతో ఎంతో ప్రత్యేకం. లైఫ్ లో మర్చిపోలేనిది.. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నా సంతోష్ కి ఓకే చెప్పాను . అతనిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను.. మన లైఫ్ లో కొన్ని కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అని పవిత్ర తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
తమ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించినందుకు వారు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ ప్రేమని అంగీకరించిన పెద్దలకి పవిత్ర ధన్యవాదాలు తెలియజేసింది. ఇక పవిత్ర త్వరలో ఓ ఇంటిది కాబోతుందని తెలుసుకున్న నెటిజన్స్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే పవిత్ర చేసుకోబోయే వ్యక్తి సంతోష్ ఓ యూట్యూబర్ అని తెలుస్తుంది. అతనితో కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడగా, ఇప్పుడు ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది.
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పాగల్ పవిత్ర కూడా ఒకరు కాగా, ఆమె మొదట టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ పాపులారిటీ అందిపుచ్చుకుంది. ఆ తర్వాత జబర్ధస్త్‌లోకి అడుగుపెట్టింది. జబర్ధస్త్‌లో తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్ లో కనిపిస్తూ నవ్వుల పువ్వులు పూయించిన పవిత్ర… కెరీర్ ఆరంభంలో కొన్ని సీరియల్స్‌లో నటించినా పవిత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే జబర్దస్త్ ఆమె జాతకాన్ని మార్చేసింది. అయితే బుల్లితెర కామెడీ షోల్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ అమ్మాయి లైఫ్‌లో ఎవరికీ కనిపించని కన్నీటి గాథలున్నాయి. తన తండ్రి మరణించడంతో తనకు ఉన్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇల్లు వాస్తుకు లేకపోవడంతో కొన్ని మరమ్మతులు చేయించింది.