పార్టీ కోసం వంద కోట్ల ఆస్తులు అమ్మేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. షాక్‌లో అభిమానులు

పార్టీ కోసం వంద కోట్ల ఆస్తులు అమ్మేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. షాక్‌లో అభిమానులు

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ రేంజ్‌లో అశేష అభిమానాన్ని చూర‌గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన అనే పార్టీని స్థాపించి జన‌సేనానిగా మారారు. గ‌త ఎన్నిక‌ల‌లో క‌నీసం ప‌వ‌న్ కూడా గెల‌వ‌క‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు చాలా ఆందోళ‌న చెందారు. అయితే ఈ సారి టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ వైసీపీని గ‌ద్దె దించ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పొత్తులో భాగంగా క‌నీసం 50 సీట్లు దక్కించుకుంటాడని, సీఎం సీటు షేర్ వస్తుందని ఆశపడిన జనసేన కార్యకర్తలు- నాయకలు ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోయారు.

కేవలం 24 సీట్లకు జనసేనాని పరిమితం కావడంతో చాలా మంది అస‌హ‌నంగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా నిర‌స‌న‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర‌స‌న సెగ చ‌ల్లార్చేందుకు ప‌వ‌న్‌పై సింప‌థీ పెరిగేందుకు ఇప్పుడు స‌రికొత్త గేమ్ స్టార్ట్ చేశాడ‌ని ఓ టాక్ వినిపిస్తుంది. జనసేన పార్టీకి ఫండ్స్ లేక పవన్ సతమతమవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న వంద కోట్ల ఆస్తుల‌ని అమ్మ‌కానికి పెట్టార‌ని ఓ ప్ర‌చారం న‌డుస్తుంది. ఎన్నికల ప్రచారం అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇటీవల పవన్ ఒక హెలికాఫ్టర్ ని అద్దెకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుండ‌గా, ఈ ఖర్చులన్నింటిని భరించడానికి జ‌న‌సేన పార్టీ ఫండ్ స‌రిపోక‌పోవ‌డంతో వంద కోట్ల రూపాయ‌ల అంత విలువైన స్థలాలు, ఇల్లు అమ్మేస్తున్నారట.

ఈ విష‌యం విని ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఇలా ప‌వ‌న్ త‌న ఆస్తులు అమ్ముకుంటూ పోతే ఎలా అంటూ ఫ్యాన్స్ బాధ‌ప‌డుతున్నారు. అయితే దీనిపై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారు కూడా లేక‌పోలేదు. ఇవన్నీ కూడా అభిమానులను ఎమోషనల్ గా టార్గెట్ చేయడం కోసమే చేశారు అంటూ మ‌రి కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. 2019లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసిన‌ప్పుడు త‌న ఆస్తులు ఏమి అమ్ముకోలేదు. మ‌రి ఇప్పుడు పోటీ చేస్తున్న 24 సీట్ల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ మ‌రికొంద‌రు దీనిని గ‌ట్టిగానే ఖండిస్తున్నారు.