థియేట‌ర్స్ ద‌గ్గ‌ర మినీ మ్యూజికల్ కాన్సర్ట్.. ప్ర‌భాస్ అభిమానులా, మ‌జాకానా…!

థియేట‌ర్స్ ద‌గ్గ‌ర మినీ మ్యూజికల్ కాన్సర్ట్.. ప్ర‌భాస్ అభిమానులా, మ‌జాకానా…!

బాహుబ‌లితో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న ప్ర‌భాస్ ఆ త‌ర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల‌తో వ‌రుస ఫ్లాపుల‌ని చ‌వి చూశాడు. మూడు బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులు ప్ర‌భాస్‌ని ప‌ల‌క‌రించిన ఆయ‌న క్రేజ్ త‌గ్గ‌లేదు. ప్ర‌భాస్ తాజా చిత్రం స‌లార్ కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూశారు. నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ప‌లు చోట్ల మూవీ ప్రీమియ‌ర్ షోలు ప‌డ్డాయి, బెనిఫిట్ షోస్ కూడా పూర్త‌య్యాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌డం విశేషం. అయితే మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని నెవెర్ బిఫోర్ అన్నట్లుగా ప్లాన్ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. సాదార‌ణంగా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే.. థియేటర్ వద్ద భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేసి, వాటికీ పూలదండలు, పాలాభిషేకాలు, లేదంటే మూగ జీవాలిని బ‌లి చేయడం, లేదా డీజే బ్యాండ్ తో సందడి చేయడం మ‌నం చూశాం.

కాని ఇప్పుడు ప్రభాస్ అభిమానులు స‌రికొత్త‌గా ట్రై చేశారు. నేటి ట్రెండ్ కి తగ్గట్టు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద రెబల్ అభిమానులు చేసిన సందడి ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్‌లో లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం ఎలా రెడీ చేస్తారు. ఇప్పుడు ప్ర‌భాస్ మూవీ ప్రీమియ‌ర్ షో ప‌డే వ‌ర‌కు మినీ మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్ న‌డిపించారు. గురువారం రాత్రి షో ప‌డే వ‌ర‌కు అక్క‌డ జ‌రిగిన సంద‌డికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నేషన్ వైడ్ వైరల్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని ఇలా కూడా చేస్తారా..? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరు కాబట్టి ప్రభాస్ కి కూడా ఆ ప్రాంతంతో అనుబంధం ఉండ‌గా, ఆ ప‌క్క‌న ఉన్న భీమవరంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ చేసిన హంగామా కూడా హాట్ టాపిక్ అయింది.భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు తమ కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న‌ అన్ని సిస్టమ్స్ లో సలార్ వాల్ పేపర్లు పెట్టి ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కంప్యూటర్ ల్యాబ్ మొత్తం సలార్ మ్యానియాతో నిండిపోయింద‌ని, భీమవరం ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్.