అల్లు అర్జున్‌తో లిప్ లాకే కాదు, రొమాన్స్‌కి కూడా రెడీ అంటున్న క్యూట్ బ్యూటీ

అల్లు అర్జున్‌తో లిప్ లాకే కాదు, రొమాన్స్‌కి కూడా రెడీ అంటున్న క్యూట్ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అల్లు అర్జున్ ఆన‌తి కాలంల‌లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. స్టైలిష్ స్టార్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించాడు. ఇక పుష్ప సినిమా బ‌న్నీ కెరియ‌ర్‌ని పూర్తిగా మార్చేసింది. ఆయ‌న‌ని ఐకాన్ స్టార్ చేసింది. ఇప్పుడు బ‌న్నీ క్రేజ్ దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా పాకింది. పుష్ప‌2 సినిమాతో అల్లు అర్జున్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అని అంటున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే అల్లు అర్జున్‌తో న‌టించేందుకు హీరోయిన్స్ క్యూ క‌డుతున్నారు. స్టార్ హీరోయిన్స్ సైతం బ‌న్నీతో ఒక్క సినిమా అయిన చేస్తే బాగుంటుంద‌ని క‌ల‌లు కంటున్నారు. క‌ళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ప‌ల‌క‌రించిన అందాల భామ ప్రియా భ‌వాని త‌న మ‌న‌సులోని మాట‌ల‌ని బ‌య‌ట‌పెట్టి పెద్ద షాక్ ఇచ్చింది. క‌న్నడ బ్యూటీ ప్రియా భ‌వాని రీసెంట్‌గా భీమా మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. గోపించంద్ స‌ర‌స‌న న‌టించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అయితే మూవీ ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా ప్రియా మాట్లాడుతూ.. బ‌న్నీతో తాను లిప్ లాక్ చేయడానికి సిద్ధ‌మ‌ని తెలిపింది.

రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏ నటుడితో సినిమాల్లో లిప్‌లాక్ చేయాలనుకుంటున్నారని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ.. తాను అల్లు అర్జున్ అభిమానినని తెలిపింది.సినిమాలో రొమాంటిక్ సీన్ ఉంటే అల్లు అర్జున్‌తో లిప్ లాక్ చేయడానికి తాను సిద్ధమంటూ చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ క‌న్న‌డ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ క‌ల ఎప్పుడు నెర‌వేరుతుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప‌2 అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఇటీవలే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ గురించి, దానికోసం సుకుమార్ చేస్తున్న ఖర్చు గురించి పెద్ద ఎత్తున వార్తలు వ‌చ్చాయి. ఇది విని షాక్ అవుతున్నారు