భర్తతో గొడవలు.. తొలిసారి నోరు విప్పి చెప్పిన ప్రియమణి.. ఎంత కష్టం వచ్చింది..!

హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందం, అభియనంతో ఒకప్పుడు హీరోయిన్గా సందడి చేసిన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. కెరీర్ మొదట్లో ప్రియమణి కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేసింది. బికినీలు వేసుకుని కూడా కనువిందు చేసింది. ఎన్టీఆర్ యమదొంగ చిత్రంతో తెలుగు చిత్ర సీమకి పరిచయమైంది ఈ అందాల భామ. ఆ తర్వాత ప్రియమణికి చాలా అవకాశాలే వచ్చాయి. ద్రోణ, పెళ్లైన కొత్తలో, ఎవరే అతగాడు, శంభో శివ శంభో, గోలిమార్, సాధ్యం, రగడ వంటి చిత్రాల్లో మెరిసింది. పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రియమణి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ పర్వం, నారప్ప, కస్టడీ ఇలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు ఎంచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. మధ్య మధ్యలో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకుంది. అయితే ప్రియమణి పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఈ మధ్య విపరీతమైన ప్రచారాలు సాగుతున్నాయి. తన భర్తకి విడాకులు ఇచ్చి సోలోగా ఉంటుందని, ఇద్దరికి పడట్లేదని ఏవేవో కథనాలు పుట్టుకు వస్తున్నాయి.ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా, అతనికి ఇది రెండో వివాహం.మొదటి భార్య నుండి విడిపోయి ప్రియమణిని పెళ్లాడాడు ముస్తఫా. ఆయన వృత్తి రీత్యా అమెరికాలో ఎక్కువగా ఉంటారు. అయితే ఆయన మొదటి భార్య ఇప్పటికీ ప్రియమణితో వివాహం చెల్లదని అనేక కామెంట్స్ చేస్తుంటుంది.
ప్రియమణి తాజాగా భామాకలాపం 2లో నటించగా, ఇది ఆహా లో ఫిబ్రవరి 16 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. భామాకలాపం ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి అనేక ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. భామా కలాపం 2లో ప్రియమణి గృహిణి పాత్ర పోషించగా, ఇందులో ఓ గ్యాంగ్‌ని అల్లాడిస్తూ వైలెంట్ పాత్ర చేసింది. ఈ క్రమంలో ప్రియమణిని రిపోర్టర్స్.. మీరు మీ భర్తను భయపెడతారా అని అడిగారు. దానికి సమాధానం ఇస్తూ.. నేను నా భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను కూడా . అంటే వైలెన్స్ అని కాదు కాని కొన్ని సందర్భాల్లో మనం భర్త మన మాట వినాలి, కొన్నిసార్లు వాళ్లు మన మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం అని ప్రియమణి చెప్పకనే చెప్పింది.