ఈ సారి పుష్ప2లో దిమ్మతిరిగే ఐటెం సాంగ్..కత్తిలాంటి ఫిగర్‌ని దించేసాడుగా..!

ఇటీవలి కాలంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాలలో పుష్ప చిత్రం ఒకటి. అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో బన్నీ నటనకి ఏకంగా నేషనల్ అవార్డ్ దక్కింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌లో సమంతకు కూడా కొంత భాగం ఉందని చెప్పాలి. ఇందులో సమంత చేసిన ఐటెం సాంగ్ దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. పొట్టి దుస్తులలో ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ” అంటూ అదరగొట్టింది. చిన్న ఫ్రాక్, బ్లౌజ్ ధరించి టెంప్టింగ్ ఫోజుల్లో బోల్డ్‌నెస్‌తో అదరహో అనిపించింది సమంత. విడాకుల తర్వాత సమంత ఇలా కనిపించడంతో ఈ విషయం కూడా తెగ హాట్ టాపిక్ అయింది.
పుష్ప చిత్రానికి సమంత ఐటెం సాంగ్ మైలురాయిగా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు పుష్ప2 కోసం కూడా అలాంటి సాంగ్ ఒకటి పెట్టాలని సుకుమార్ భావిస్తున్నాడట. పుష్ప2లో కూడా సమంతతోనే చేయిస్తాడనే ప్రచారం జరుగుతున్నా కూడా మేకర్స్ వాటిని ఖండిస్తున్నారు. ఈ సారి కొంత కొత్తదనం కోసం వేరే స్టార్ హీరోయిన్స్‌ని పరిశీలిస్తున్నారట. చాలా మంది స్టార్ హీరోయిన్స్‌ని పరిశీలించిన అనంతరం సుకుమార్ ఆర్ఆర్ఆర్ బ్యూటీ, బాలీవుడ్ అందాల భామ అలియా భట్ ని ఫైనల్ చేశాడట. పుష్ప సినిమాకి మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో అలియా భట్ పుష్ప2లో ఐటెం భామగా అలరించనుందనే టాక్ నడుస్తుంది.
అలియా భట్‌కి ఆర్ఆర్ఆర్ చిత్రంతో హిందీతో పాటు ఇతర భాషలలోను మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే అలియా భట్ ఆమెని పుష్ప2లో ఐటెం సాంగ్ కోసం సంప్రదించాడనే టాక్ నడుస్తుంది. అలియా భట్‌ని ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రంలోను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారు. కాని కుదరలేదు. అయితే పుష్ప2తో ఈ భామ దిమ్మతిరిగిపోయేలా చేయడం ఖాయం అని అంటున్నారు. ఇక పుష్ప2 చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, మిగతా పాత్రలలో అనసూయ, సునీల్. ఫహద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.