బుచ్చిబాబు త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా కూడా క‌న్‌ఫాం అయింది.. ఏ ద‌ర్శ‌కుడితో అంటే..!

బుచ్చిబాబు త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా కూడా క‌న్‌ఫాం అయింది.. ఏ ద‌ర్శ‌కుడితో అంటే..!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ క్రేజ్ గ్లోబ‌ల్ స్థాయికి చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారిపోయాడు. చిత్రంలో చెర్రీ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఇక ఇప్పుడు అదే ఉత్సాహంతో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుంది. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌భుత్వ అధికారిగా క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ఏడాది చివ‌రలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా త‌ర్వాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

`ఆర్‌సీ16`పేరుతో ఈ మూవీ ప్ర‌చారం జ‌రుపుకుంటుండ‌గా, చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్టు టాక్. ఉత్తరాంధ్రనేపథ్యంలో చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతి కూడా నటించే అవకాశం ఉందని మూవీ షూటింగ్ ఈ నెల 20న ప్రారంభించబోతున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే రోజు మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంద‌ట‌. ఇక అదే రోజు ఆర్సీ 17 సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌స్తుంద‌ని స‌మాచారం.

బుచ్చిబాబు తర్వాత రామ్ చ‌ర‌ణ్ చేయ‌బోతు సినిమాని సుకుమార్‌ దర్శకత్వం వహించబోతున్నారట. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రంగ‌స్థ‌లం చిత్రం రూపొంది ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు వారిద్ద‌రు మ‌రోసారి క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ట‌. సుక్కు ప్ర‌స్తుతం పుష్ప‌2తో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ సినిమాని మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు టాక్. మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించబోతున్నారు. రంగ‌స్థ‌లం సీక్వెల్‌గా ఈ మూవీ ఉంటుంద‌ని టాక్ న‌డుస్తుంది. ఈ మూవీకి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రావ‌ల్సి ఉంది. ఇక చెర్రీ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజయ్‌ లీలా భన్సాలీతో కూడా ఓ మూవీ చేయబోతున్నారు.