యానిమల్ కోసం రష్మిక మరీ ఇంత తెగించిందేంటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మంధాన ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాలు చేసింది. అయితే ఏ సినిమాలోను రెచ్చిపోయి అందాలు ఆరబోయలేదు. ఎప్పుడైదే బాలీవుడ్‌లో అడుగుపెట్టిందో రష్మిక గ్లామర్‌కి తెరలేపింది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.రష్మిక రీసెంట్‌గా యానిమల్ అనే చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ రాబడుతుంది. అయితే ఈ చిత్రాన్ని యూత్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం రష్మిక తీరుపై గుర్రగా ఉన్నారు.
రష్మిక యానిమల్ చిత్రంలోని కొన్ని సీన్స్‌లో చాలా బోల్డ్‌గా కనిపించింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఆమె చేసిన రచ్చ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో బెడ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ కి కొదవే లేదు. రణ్ బీర్ కపూర్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రష్మిక డ్రెస్ విప్పి బ్రాలో కనిపించి అందరికి షాకిచ్చింది. అక్కడితే ఆగలేదు. రణ్ బీర్ కపూర్ ఆమె బ్రా లాగి కొట్టడంతో వీపు భాగం కమిలిపోతుంది. దీంతో అప్పుడు బెడ్‌పై బ్యాక్ చూపించిన తీరు, ఆ సీన్లు సైతం టూ మచ్‌గా, బోల్డ్ గా అనిపించాయి. ఇక ఛాన్స్ దొరికితే లిప్ లాక్ సీన్లతో ఇద్దరు రెచ్చిపోయారు. సెక్స్ కి సంబంధించిన చర్చ ఓపెన్‌గా చేసుకోవడం, ఇక్కడనా, అక్కడనా.. ఇలా మరీ ఓపెన్‌గా మాట్లాడుకోవడం వంటివి యూత్‌కి మాంచి కిక్ ఇచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు.
తెలుగు సినిమాలలో ఎంతో పద్దతిగా నటించిన రష్మిక యానిమల్‌లో మాత్రం రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ కాక రేపింది. అయితే సౌత్‌లో పద్దతిగా చేసే మీరు హిందీలోకి వెళితే ఎలాంటి హద్దులు కనిపించవని, ఎంతకైనా తెగిస్తారని రష్మికని తిట్టి పోస్తున్నారు. సాధారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమాలలో బౌండరీస్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే సందీప్ ఇలాంటి వాటిపై క్లారిటీ ఇస్తారు. రష్మిక వాటన్నింటికి ముందుగానే కమిటై సినిమాలో ఇంత దారుణంగా గ్లామర్ షో చేయడం మాత్రం షాకింగ్‌గా మారింది.