నువ్వు అది చేయకపోతే నిరాహార దీక్ష చేస్తా.. ఎట్టకేలకి దిగొచ్చిన రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మంధాన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లో కూడా రష్మికకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఇటీవల ‘యానిమల్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ చిత్రానికి సంబంధించిన ఏ సక్సెస్ పార్టీలోనూ కనిపించలేదు. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించలేదు. అయితే అందుకు గల కారణం ఏంటో తాజాగా చెప్పుకొచ్చింది. యానిమల్ విజయాన్ని మా టీమ్‌తో కలిసి ఆస్వాదించాలని నేను అనుకున్నాను.
కాని యానిమల్’ విడుదలైన మరుసటి రోజే మరో సినిమా చిత్రీకరణతో నేను బిజీగా ఉండడంతో కుదరలేదు. కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాల కోసం రాత్రిళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. మీరు నన్ను మిస్ అవుతారని నాకు తెలుసు. ఆ లోటుని నేను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తా. మిమ్మల్ని అలరించేందుకు నేను తప్పక ప్రయత్నిస్తా. మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది అని రష్మిక పేర్కొంది.ఇప్పుడు రష్మిక పుష్ప ది రూల్ చిత్రంతో పాటు రెయిన్బో, ది గాళ్ ఫ్రెండ్, చావా వంటి తెలుగు, హిందీ ప్రాజెక్టులు చేస్తుంది. ఇక తాజాగా ఇన్‌స్టాలో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సమయంలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
అలానే ఇన్‌స్టాలో సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. షూటింగ్ గ్యాప్‌లో ఈ ఫోటోలను తీసుకుంటున్నట్టు కూడా తెలిపింది. అయితే రష్మిక డైహార్డ్ ఫ్యాన్ ఒకరు వారం రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టాడు. `ఈ రోజు నవ్వు కనీసం హాయ్ అని రిప్లై ఇవ్వకపోతే ఏమీ తినను, నిరాహార దీక్ష చేస్తా` అంటూ రష్మికకి చాలా కూల్ వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఆమె సెల్ఫీ ఫొటోకి కూడా కామెంట్ చేస్తూ.. మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావ్ అదే గ్యాప్‌లో నాకు ఒక రిప్లై ఇవచ్చుగా అంటే కన్నీళ్లు పెడుతున్న ఎమోజీని పోస్ట్ చేయడంతో రష్మిక కరిగిపోయింది. వెంటనే స్పందిస్తూ.. నవ్వుతూ ఉన్న ఎమోజీలను పంచుకుంటూ `గ్యాప్ లో అంట.. వర్క్ గ్యాప్ లో ఈ సెల్ఫీ తీసుకున్నాన్ రా, సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే` అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. దీంతో ఆ అభిమానికి రష్మిక సమాధానం ఇవ్వడంతో ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.ఇక రష్మిక రిప్లైకి అభిమాని ఉప్పొంగిపోతూ.. `నువ్వు అలా `రా` అంటుంటే ఎంత బాగుందో` అంటూ ధన్యవాదాలు తెలియజేశాడు.