న‌న్ను అక్కా అని ఎందుకు అంటున్నావ్.. ర‌తిక పంచాయ‌తీ..!

న‌న్ను అక్కా అని ఎందుకు అంటున్నావ్.. ర‌తిక పంచాయ‌తీ..!

బిగ్ బాస్ తాజా ఎపిపోడ్ రతిక, ప్రశాంత్ మధ్య జరుగుతున్న ఎమోషనల్ అండ్ డ్యామేజ్ డిస్కషన్‌తో మొదలైంది. ఓ సంద‌ర్భంలో ర‌తిక‌, ప్ర‌శాంత్ మ‌ధ్య పెద్ద డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌గా, ఆ స‌మ‌యంలో ప్ర‌శాంత్.. ర‌తిక‌ని అక్క అని పిలుస్తాన‌ని చెప్పాడు. అన్న‌ట్టుగానే అప్ప‌టి నుండి అక్కా అని పిలుస్తూ వ‌స్తున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ర‌తిక‌.. తనను అక్కా పిలవకని చెప్ప‌గా.. లేదు నేను అక్కా అనే పిలుస్తా అని పల్లవి ప్రశాంత్.. ఇద్దరూ వాదించుకోవడం జ‌రిగింది. ఇక ఇద్ద‌రి విష‌యంలో శివాజి ఇన్వాల్వ్ అయి వారికి ఓ సూచ‌న చేస్తాడు. ‘నువ్వు రతికను అక్కా అంటే.. బయట వేరేగా పోతుంది. కాబట్టి అక్కా అనకు. హౌస్‌లో ఉండేంత వరకు ఇలా ఉండు.. బయటికి వెళ్లాక నీ ఇష్టం’ అని చెప్ప‌డంతో ప్ర‌శాంత్ ఒకే అంటూ త‌ల ఊపుతాయి.

ఇక ర‌తిక‌, ప్ర‌శాంత్ ఫ్రెండ్స్ అంటూ ఇద్ద‌రు హ‌గ్ ఇచ్చుకుంటారు. అనంత‌రం బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త కెప్టెన్ ని నిర్ణయించేందుకు ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ పోటీలో ఉన్న సభ్యుల్లో నచ్చని వారికి మిగిలిన ఇంటి సభ్యులు మిర్చీ మాల వేయాల‌ని బిగ్ బాస్ చెప్పారు. అంతేకాదు వారు కెప్టెన్ గా ఎందుకు అనర్హులో రీజన్ కూడా చెప్పాల‌ని, చివ‌రికి ఎవరి మెడలో తక్కువ మిర్చి మాలలు ఉంటే వారే కెప్టెన్ అవుతార‌ని స్ప‌ష్టం చేశారు. ముందుగా అమర్ దీప్ ప్రారంభించ‌గా, మిర్చి మాల తీసుకుని ప్రశాంత్ కి వేశాడు. మిగిలిన వాళ్లంతా నామినేషన్స్ లో ఉన్న కార‌ణంగా, ఇది నీకు వేసా అని అమర్ దీప్ తెలిపాడు. కార‌ణం న‌చ్చిన ప్ర‌శాంత్ కొద్ది సేపు డిస్క‌ష‌న్ జ‌రిపాడు.

ఆ తర్వాత యావర్.. శోభా మెడలో మిర్చి మాల వేయ‌గా, వీరిద్దరి మధ్య వాగ్వాదం తార స్థాయికి చేరింది. శోభా యావర్ ఇద్దరూ హద్దులు దాటే విధంగా మాట్లాడుకున్నారు. రీజన్ లేకపోయినా నెక్స్ట్ టైం నేను నిన్నే టార్గెట్ చేస్తా అంటూ శోభా తెగ నోరు జారింది. పిచ్చోడు అంటూ శోభా కామెంట్ చేయ‌డంతో యావ‌ర్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆ స‌మ‌యంలో శివాజీ ఇద్దరిని శాంతింప‌జేశాడు. ఇలా మిర్చి మాల‌లు కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఉన్న వారంద‌రిలో ప‌డ్డాయి. గౌత‌మ్ మెడ‌లో ఎవ‌రు మాల‌లు వేయ‌క‌పోవ‌డంతో ఈ వారం కెప్టెన్‌గా డాక్ట‌ర్ బాబు నిలిచాడు. అత‌నికి అంద‌రు కంగ్రాట్స్ చెప్ప‌గా, అర్జున్ కెప్టెన్ బ్యాండ్ తీసి గౌత‌మ్‌కి

ఇస్తాడు.