పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మ‌రో టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఏడాదే అంద‌రు భామ‌లు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటున్నారు..!

  • By: sn    breaking    Mar 04, 2024 11:20 AM IST
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మ‌రో టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఏడాదే అంద‌రు భామ‌లు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటున్నారు..!

ఈ ఏడాది చాలా మంది హీరోయిన్స్ పెళ్లి పీట‌లెక్కుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూ ఉన్నాం. ఇటీవ‌ల ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న ప్రియుడు జాకీ భ‌గ్నానీతో ఏడ‌డుగులు వేసింది. వీరి వివాహ వేడుక అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఇక అందాల ముద్దుగుమ్మ తాప్సీ కూడా మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఈ భామ విదేశి క్రీడాకారుడితో బిజీగా ఉంది. అత‌డిని టైం చూసుకొని సైలెంట్‌గా పెళ్లి చేసుకోనుంది. ఇక రీసెంట్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు విడుద‌ల చేసి షాకిచ్చింది. 14 ఏళ్లు అత‌నితో ప్రేమ‌లో ఉన్న ఈ భామ రీసెంట్‌గా అత‌నితో నిశ్చితార్థం చేసుకొని త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్కేందుకు సిద్ధ‌మైంది.

హీరోయిన్ రెజీనా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో రెజీనా బీజీగా ఉండేది. కాని ఇప్పుడు ఆ అమ్మ‌డి హ‌వా త‌గ్గింది. త‌మిళంలో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్‌ల‌తో బిజీ అయింది రెజీనా. చిన్న చిన్న సినిమాల‌లో కూడా న‌టిస్తూ అల‌రిస్తుంది. అయితే కెరీర్ అంత ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో రెజీనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైంద‌నే టాక్ న‌డుస్తుంది. గతంలో హీరో సందీప్ కిషన్ తో రిలేషన్ లో ఉన్నారని జోరుగా ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత సందీప్ దానిపై క్లారిటీ ఇవ్వ‌డంతో రూమ‌ర్స్ ఆగిపోయాయి. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టే ప్ర‌చారాలు చేశారు. కాని ఆ వార్త‌లు గాలి వార్త‌లుగానే మిగిలిపోయాయి.

ఇప్పుడు ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు స‌మాచారం. ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెప్ప‌డంతో వారి పెళ్లి ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ట‌. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని ప్ర‌స్తుతం మాత్రం వారి పెళ్లికి సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. కాగా, రెజీనా.. తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాత‌లు ద‌క్కించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన రెజీనా 2012లో ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ఆ తర్వాత పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కొత్తజంట సినిమాలతో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది.