ఎవిక్షన్ పాస్ కోసం కొట్లాట.. యావర్‌కి దక్కకుండా శోభా కుట్ర

బిగ్ బాస్ సీజన్ 7లో 11వ వారం నామినేషన్స్ ఎంత రచ్చగా మారాయో మనం చూశాం. ఇక నామినేషన్స్ తర్వాత ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో అర్జున్ గెలుపొంది శివాజీ చేతుల మీదుగా ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. అయితే సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా కాబట్టి అర్జున్‌కి అప్పుడే ఎవిక్షన్ పాస్ దక్కినట్టు కాదని, చిన్న ట్విస్ట్ ఉందని గత ఎపిసోడ్‌లో తెలియజేశాడు బిగ్ బాస్. అయితే తాజా ఎపిసోడ్‌లో ఎవిక్షన్ పాస్ అర్జున్ చెంత ఉండాలి అంటే అతను టాప్ 5 లో ఒకరితో పోటీ పడి దానిని నిలబెట్టుకోవాలని చెప్పుకొచ్చాడు. దీంతో అర్జున్ తనకి పోటీగా యావర్‌ని ఎంచుకున్నాడు.
వీరిద్దరికి బిగ్ బాస్.. టేబుల్ పై బాల్స్ ని బ్యాలెన్స్ చేసే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో యావర్ విజయం సాధించడంతో ఎవిక్షన్ పాస్ అతని దగ్గరకు వెళ్లింది.అయితే ఆ పాస్ యావర్ దగ్గరే ఉండాలంటే ఆయన పలు రౌండ్స్‌లో విజయం సాధించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే ఒక రౌండ్‌లో ప్రశాంత్‌తో పోటీ పడి విజేతగా నిలిచిన యావర్ మరో రెండ్‌లో శోభా శెట్టితో పోటీ పడి గెలుపొందాడు. చివరి రౌండ్ లో యావర్ శివాజీ, ప్రియాంకలతో పోటీ పడాల్సి ఉంటుందని తెలియజేశాడు.ఈ రౌండ్‌లో ధనుస్సుకి ఉన్న బాణాలపై బాల్స్ ని బ్యాలెన్స్ చేయాల్సి ఉండగా, ఇందులో ఎవరు విజేత అయితే వారిదే ఎవిక్షన్ పాస్ అని బిగ్ బాస్ స్పష్టం చేశాడు..
ఈ టాస్క్‌లో ప్రియాంక బాల్స్ బ్యాలెన్స్ చేయలేక తప్పుకుంది. ఇక శివాజీ, యావర్ మధ్య పోటీ జరగగా శివాజీ కన్నా కూడా యావర్ ఎక్కువ సేపు బ్యాలెన్స్ చేశాడు. అయితే ఈ టాస్క్ కి ప్రశాంత్ , శోభా శెట్టి సంచాలకులుగా వ్యవహరించగా రిజల్ట్ ప్రకటించే సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది శోభా. ప్రియాంక రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అయిదని, మిగతా వారు సరిగ్గా రూల్స్ పాటించలేదన్నట్టుగా శోభా చెప్పుకొచ్చింది. ప్రియాంకకి ఫేవర్ గా శోభా శెట్టి రిజల్ట్ ప్రకటించేందుకు రెడీ అవుతోందని తెలుసుకున్న శివాజి ఆమెతో గొడవకు దిగారు. ఇక యావర్, ప్రియాంక లలో ఎవరు గేమ్ రూల్స్ బాగా ఫాలో అయ్యారు అంటూ శోభా శెట్టి ఇతర ఇంటి సభ్యుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయగా యావర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా ప్రియాంకని విన్నర్ చేసేందుకు కుట్ర అని యావర్, శివాజి మండిపడ్డారు. ఇంతకు విన్నర్ ఎవరు అనేది నేటి ఎపిసోడ్ లో తెలియనుంది.