చెల్లి త‌గ్గించింది, అక్క డోస్ పెంచింది.. రాజ‌శేఖ‌ర్ త‌న‌యల అందాల దుమారం ఓ రేంజ్‌లోనే..!

  • By: sn    breaking    Jan 03, 2024 10:07 AM IST
చెల్లి త‌గ్గించింది, అక్క డోస్ పెంచింది.. రాజ‌శేఖ‌ర్ త‌న‌యల అందాల దుమారం ఓ రేంజ్‌లోనే..!

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రాజశేఖర్-జీవిత దంపతులు. యాంగ్రీ హీరోగా రాజశేఖర్ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించ‌గా, ఇక నటిగా, దర్శకురాలిగా జీవితకి కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు వారి నట వారసులుగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు శివాని, శివాత్మిక‌. దొరసాని సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. శివాత్మిక ఇప్పటి వరకు తెలుగులో మూడు సినిమాలే చేసిన అందులో తన నటనతో మెస్మరైజ్‌ చేసింది. అలాగే శివానీ సైతం మూడు నాలుగు సినిమాలు చేయ‌గా, ఆమె చేసిన పాత్ర‌ల‌కి మంచి గుర్తింపు ద‌క్కింది.

చివ‌రిగా కోట బొమ్మాళి పీఎస్‌ చిత్రంలో నటించి అల‌రించింది. మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా ఎలక్షన్ల టైమ్‌లో రావడంతో కలెక్షన్లలో సత్తా చాటలేకపోయింది. ఈ సంక్రాంతికి ఓటీటీలో విడుద‌ల కాబోతుండ‌గా, అక్క‌డ మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఇందులో శివాని పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించి సంద‌డి చేసింది. అయితే ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటారు. శివాత్మిక సోష‌ల్ మీడియాలో బౌండ‌రీలు బ్రేక్ చేస్తూ కుర్రాళ్లకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటుంది. అయితే శివాని మాత్రం చాలా వరకు హద్దుల్లోనే ఉంది. కానీ ఇటీవల మాత్రం ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది.

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కి సై అంటుంది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌లో కూడా న‌టిస్తాన‌ని పేర్కొంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాల దుమారం రేపుతుంది . తాజాగా చీర‌క‌ట్టులో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల‌కి చెమ‌ట‌లు ప‌ట్టించింది. వైట్‌ శారీలో స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించిం, కాస్త క్లీవేజ్ అందాలను చూపిస్తూ, మతిపోయే పోజులిచ్చింది. విరహంతో కూడిన పోజుల‌కి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా విరహంతో అమ్మ‌డు ఇచ్చిన పోజుల‌కి కుర్రాళ్లు థ్రిల్ అయిపోతున్నారు. శివాత్మిక ఇటీవల గ్లామ‌ర్ డోస్ త‌గ్గించిన‌ట్టు క‌నిపించ‌గా, అక్క శివానీ మెల్ల‌మెల్ల‌గా పెంచుతుంది. శివాని విజువ‌ల్ ట్రీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌నే చెప్పాలి.