Special Trains | హోలీకి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | హోలీ పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్-దానాపూర్, దానాపూర్ – హైదరాబాద్, సికింద్రాబాద్-సంత్రగాచి, సంత్రగాచి-సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. హైదరాబాద్-దానాపూర్ (07647) రైలు ఈ నెల శనివారం(23న) రాత్రి 8.20 గంటలకు బయలుదేరి రెండురోజుల తర్వాత అంటే సోమవారం ఉదయం 5.50 గంటలకు గంటలకు దానాపూర్ చేరుకుటుంది. దానాపూర్ – సికింద్రాబాద్ (07648) రైలు 26న సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరుతుంది. హైదరాబాద్-దానాపూర్-హైదరాబాద్ రైలు ఇరుమార్గాల్లో సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండుం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్‌పూర్, కట్ని, సాత్న, మణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, పండిత్ ధీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లలో ఆగుతుంది.
23న (శనివారం) సికింద్రాబాద్-సంత్రగాచి (07645) రైలు రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. రైలు సోమవారం వేకువ జామున 12.15 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. సంత్రగాచి-సికింద్రాబాద్ రైలు (07646) రైలు 25న సోమవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంరోడ్, బర్హంపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్పూర్ కియోంఝర్ రోడ్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.