సుమని పూనిన కుమారి ఆంటీ..రెండు లివర్స్ ఎక్స్‌ట్రా అంటూ..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. హైదరాబాద్ నగరంలో భోజనం వ్యాపారం చేసుకుంటోన్న ఈమె.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి కూడా గురైంది. దాంతో ఆమెకి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది నాన్నా అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌కి ఇప్పుడు చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. కుమారి ఆంటీకి రోజురోజుకి క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆమె బుల్లితెరపై కూడా కనిపించి సందడి చేసింది. ప్రతి ఏటా మా టీవీ బిగ్ బాస్ ఉత్సవం పేరుతో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తుండగా, అందులోకి బిగ్ బాస్‌లో పాల్గొన్న వారందరిని ఆహ్వానిస్తూ ఉంటుంది.
ఈ ఏడాది బిగ్ బాస్ ఉత్సవంలో భాగంగా.. కుమారి ఆంటీని స్టేజ్‌పైకి తీసుకుని వచ్చి తెగ సందడి చేయించారు. కుమారి ఆంటీని పల్లవి ప్రశాంత్ వెంటపెట్టుకుని రాగా, ఆమె చెప్పిన ఫేమస్ డైలాగ్… ‘రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది నాన్నా’ అంటూ అర్జున్ అంబటి ఇమిటేట్ చేసి తెగ నవ్వించాడు. ఇలా కుమారి ఆంటీ రోజురోజుకి తన క్రేజ్ తెగ పెంచుకుంటుంది. ఇక ఇదే సమయంలో యాంకర్ సుమ కుమారి ఆంటీ డైలాగ్‌కి ఓ రీల్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ నవ్విస్తుంది. కుమారీ ఆంటీ మాదిరిగానే భోజనం వడ్డిస్తూ.. ఆమె డీజే సాంగ్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అదరగొట్టింది. ఇందులో మధ్యమధ్యలో బ్రహ్మాజీ కూడా మెరిసారు.
సుమ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. సుమ క్రియేటివిటీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక వెరైటీ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈవెంట్స్, టీవీ షోలు, సోషల్ మీడియా ఇలా ఒకటేంటి సుమ తనదైన శైలిలో అంతటా అలరిస్తూనే ఉంది. ఇటీవల సుమ తన తనయుడు రోషన్‌ని బబల్ గమ్ అనే సినిమాతో వెండితెరకి పరిచయం చేసింది.ఈ మూవీ ప్రమోషన్ కోసం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలందరిని వాడేసింది.