సుమని చాలా బాధ పెట్టిన రాజీవ్ కనకాల.. పాతికేళ్ల తర్వాత క్షమాపణలు
రాజీవ్ కనకాల తాజాగా తాను చేసిన తప్పులకి సుమకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మోస్ట్ క్రేజీయెస్ట్ జంటలలో సుమ, రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. ఈ జంట చాలా చూడముచ్చటైన జంటగా అనిపిస్తుంటుంది. సుమ తన మాటలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుండగా, రాజీవ్ మాత్రం నటనతో మెప్పిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇటీవల విడిపోతున్నట్టు ఎక్కువగా ప్రచారాలు సాగాయి. దానిపై ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల పూర్తి క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే రాజీవ్ కనకాల తాజాగా తాను చేసిన తప్పులకి సుమకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సుమ- రాజీవ్ ఇటీవల తమ 25వ పెళ్లి రోజును ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుమ తన యూట్యూబ్ ఛానల్‌లో తన భర్తతో కలిసి ఓ వీడియో చేయగా, అందులో ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. సుమ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి ఆసక్తికరంగా ఆన్సర్స్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ నెటిజన్ మీ భాగస్వామికి తెలియకుండా ఆమె ఫోన్‌ను ఎప్పుడైనా చెక్ చేశారా? అని అడిగితే.. రాజీవ్ కనకాల అందుకు నో అని చెప్పాడు. కానీ సుమ మాత్రం యస్ అని చెప్పి నవ్వింది. అయితే చెక్ చేసా కాని అందులో ఏమి దొరకలేదు అని పేర్కొంది. అప్పుడు రాజీవ్ దొరికిలే మనం ఉంచుతామా అంటూ సరదాగా మాట్లాడాడు.
ఇక ఏ విషయంలోనైనా ఇద్దరు గొడవపడేవారా అన్న ప్రశ్నకు…సుమ షాకింగ్ సమాధానం ఇచ్చింది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ దెయ్యాల సినిమాలకు ఎక్కువగా తీసుకెళ్లేవాడని, ఆ విషయంలో ఇద్దరికీ గొడవలు బాగా అయ్యేవని పేర్కొంది. ఇక బయటకు వెళ్లినప్పుడు ఎప్పుడు అడిగినా 5 నిమిషాలలో వచ్చేస్తా అని చెబుతాడు. కానీ ఎప్పుడూ రాడు. ఆ విధంగా చాలా సార్లు చేశాడు అంటూ సుమ ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ రాజీవ్ కనకాల సారీ చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పగానే సుమ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయింది. ఇక తన పెళ్లిరోజును కూడా గుర్తు చేసుకుంటూ అప్పట్లో తమ ఇంట్లో వ్యతిరేకత ఉన్నా తర్వాత అందరూ ఒప్పుకున్నారని కూడా సుమ ఈ సందర్భంగా తెలియజేసింది.