వ‌దిన‌ను చంపేసి.. మృత‌దేహంతో మ‌రిది శృంగారం

ఓ ఇద్ద‌రు యువ‌కులు క్రూర మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. వ‌దిన‌పై కామంతో ర‌గిలిపోయారు. ఆమెకు మ‌ద్యం తాగించి చంపేశారు. మృత‌దేహంతో శృంగారం చేసి పైశాచిక ఆనందం పొందారు.

వ‌దిన‌ను చంపేసి.. మృత‌దేహంతో మ‌రిది శృంగారం

రాయ్‌పూర్ : ఓ ఇద్ద‌రు యువ‌కులు క్రూర మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. త‌ల్లితో స‌మాన‌మైన వ‌దిన‌పై క‌న్నేసి, కామంతో ర‌గిలిపోయారు. ఆమెకు మ‌ద్యం తాగించి, ఆ మ‌త్తులో చంపేశారు. అనంత‌రం లైంగిక అనుభూతి కోసం మృత‌దేహంతో శృంగారం చేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌ల‌రాంపూర్ జిల్లాలో జ‌న‌వ‌రి 30వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌ల‌రాంపూర్ జిల్లాలోని ప‌ర‌స్స‌గుడి హ‌రిత్మ గ్రామానికి చెందిన భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ బ‌తుకుదెరువు కోసం పొరుగున ఉన్న సురుగుజా జిల్లాలోని అకోలాకు వెళ్లారు. అయితే వ‌దిన‌పై మ‌రిది క‌న్నేశాడు. దీంతో త‌మ‌కున్న వ్య‌వ‌సాయ భూమిలో ప‌నులు చేసుకుందామ‌ని చెప్పి, జ‌న‌వ‌రి 30వ తేదీన వ‌దిన‌ను పిలిపించాడు మ‌రిది. ఇక మ‌రిది, మ‌రో వ్య‌క్తి క‌లిసి ఆమెను స‌మీప అడ‌వుల్లోకి తీసుకెళ్లారు.

అక్క‌డ ముగ్గురు క‌లిసి మ‌ద్యం సేవించారు. మ‌ద్యం మ‌త్తులో వ‌దిన మెడ‌కు నైలాన్ తాడు బిగించి, మ‌రిది చంపేశాడు. అనంత‌రం ఆమె మృత‌దేహంతో ఇద్ద‌రు యువ‌కులు క‌లిసి శృంగారం చేసి పైశాచిక ఆనందం పొందారు. ఆ త‌ర్వాత డెడ్‌బాడీని అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు.

మ‌రుస‌టి రోజు మ‌హిళ మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మృతురాలి ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె మ‌రిదితో పాటు మ‌రో యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను చంపేసి, లైంగిక అనుభూతి కోసం శృంగారం చేసిన‌ట్లు అంగీక‌రించారు. మ‌రో యువ‌కుడు కూడా మ‌హిళ‌కు బంధువేన‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.