తెలంగాణ ఎన్నికలు.. నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు

హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30న వేతనంతో కూడిన సెలవును తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది. ప్రజా ప్రతినిధులచట్టం కింద కర్మాగారాలు, సంస్థల చట్టం -1974, తెలంగాణ దుకాణ సముదాయాల చట్టం-1988 పరిధిలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.