గెలుపు మాదే.. అందుకు ఈ మూడే కారణాలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయేది ఎవరో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.

- ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడా గెలవదు
- రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
జైపూర్: ప్రస్తుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క చోట కూడా గెలిచే అవకాశాలు లేనే లేవని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినప్పటికీ.. రాజస్థాన్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. అందుకు ఆయన మూడు కారణాలను ప్రధానంగా చూపారు. ఈ మూడు కారణాల వల్ల రాజస్థాన్‌లోనే కాకుండా ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రాబోదని స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన మొదటికారణంగా చెప్పారు. ‘రెండో అంశం ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి లోటు చేయలేదని బీజేపీ ఓటర్లు సైతం అంగీకరిస్తున్నారు. మూడో కారణం.. ప్రధాని, హోం మంత్రి, బీజేపీ చీఫ్, ఇతర కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రసంగాల్లో వాడిన భాష. అలాంటి భాషను ఎవరూ ఇష్టపడరు’ అని గెహ్లాట్ వివరించారు.
బీజేపీ ఉపయోగించిన మతం కార్డు పనిచేస్తేనే రాజస్థాన్‌లో ఆ పార్టీకి విజయావకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నాయకులు బెదింపు ధోరణితో, భయపెట్టే పద్ధతిలో మాట్లాడారన్న గెహ్లాట్.. దీనిని ప్రజలు ఆమోదించలేదనని తాను భావిస్తున్నట్టు చెప్పారు.