తెలుగులో ప్ర‌స్తుతం దుమ్ము రేపుతున్న టాప్ 10 సీరియ‌ల్స్ ఇవే..!

తెలుగులో ప్ర‌స్తుతం దుమ్ము రేపుతున్న టాప్ 10 సీరియ‌ల్స్ ఇవే..!

ఇంట్లో ఉండే వారికి సీరియ‌ల్స్ చాలా కాల‌క్షేపం అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీలు వచ్చినా.. కూడా సీరియల్స్ కు ఉండే ఫాలోయింగ్ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గడం లేదు. కొన్ని స్ట్రైట్ సీరియ‌ల్స్‌తో పాటు డ‌బ్బింగ్ సీరియ‌ల్స్ కూడా తెగ సంద‌డి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలుగులో టాప్ 10 సీరియ‌ల్స్ ఏంట‌నేవి చూస్తే మొద‌టి స్థానంలో బ్ర‌హ్మ‌ముడి ఉంది. ముగ్గురు ఆడపిల్లలు.. ఒకే ఇంటికి కోడళ్లు ఎలా వెళ్లారు.. అక్కడ వారి జీవితం ఎలా ఉంటుంది అనే క‌థ‌తో ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. ఇక రెండోది నాగ పంచ‌మి కాగా, ఇందులో పాము అని తెలియక ఓ యువ‌తిని యువకుడు పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ త‌ర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ సీరియ‌ల్స్ చూస్తే అర్ధ‌వుతుంది. ప్ర‌తి ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

మూడోది నువ్వు, నేను ప్రేమ.. హిందీలో వచ్చిన పాపులర్ సీరియస్ ఇస్ పార్యా కో క్యా నామ్ ధూ ని తెలుగులో నువ్వు, నేను ప్రేమ పేరిట రీమేక్ చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని బాగానే ఆక‌ట్టుకుంటుంది. ఇక నాలుగోది కృష్ణ ముకుంద మురారి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది. ఐదోది మామగారు.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్ ఇటీవ‌ల మొద‌లు కాగా, ఈ సీరియ‌ల్‌కి మంచి టీఆర్పీ వ‌స్తుంది. ఇక ఆరోది త్రినయని…ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతుండ‌గా, ఇది రియాల్టీకి చాలా దూరంగా ఉంటుంది.

ఏడోది గుండె నిండా గుడి గంటలు.. స్టార్ మాలో కొత్తగా మొదలైన ఈ సీరియల్ బాధ్యతగల అమ్మాయికీ, బాధ్యతలేని అబ్బాయికి పొత్తు ఎలా కుదిరింది. వారి బంధం ఎలా కొనసాగుతుంది అనే నేప‌థ్యంలో రూపొంది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఎనిమిదోది పడమటి సంధ్యారాగం.. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తొమ్మిదోది గుప్పెడంత మనసు.. స్టార్ మా లో సాగే ఈ సీరియల్ ఒకప్పుడు టాప్ వన్ లో ఉండ‌గా, ఇప్పుడు తొమ్మిదో స్థానానికి చేరుకుంది . ప‌ద‌వ‌ది జగధాత్రి..జీ తెలుగులో వస్తున్నఈ సీరియ‌ల్ లో సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గా ఓ అమ్మాయి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. ఇది కూడా ఇటీవ‌లి కాలంలో మొద‌లు కాగా, దీనికి మంచి రేటింగ్ వ‌స్తుంది.