త్రిష ఆస్తులు గురించి తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం.. లగ్జరీ బంగ్లాలు,ఖరీదైన కార్లు!

చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు,తమిళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న త్రిష ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించింది. తమిళంలోనే సినిమాలు చేస్తున్న త్రిష తెలుగులో పూర్తిగా తగ్గించేసింది.ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ త్రిష హవా తగ్గలేదు.ఆమెతో వచ్చిన హీరోయిన్స్ అందరు కూడా ఫేడ్ అవుట్ అయి పెళ్లిళ్లు చేసుకోగా, త్రిష మాత్రం ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉంది. ఆ మధ్య 96 సినిమాతో హీరోయిన్ గా తన సత్తా చాటి పొన్నియన్ సెల్వన్ 1, 2 సినిమాలతో త్రిష ఇమేజ్ పీక్స్‌కి వెళ్లింది.
త్రిష కెరీర్ ముగిసింది అయిపోయిందనుకున్న సమయంలో త్రిష మళ్లీ పుంజుకుంది. 40 ఏళ్ళ వయస్సులో త్రిష తన గ్లామర్ తో.. నటనతో..ఎంతగానో మెప్పిస్తుంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. ఇటీవల త్రిష దళపతి విజయ్ తో కలిసి లియోలో నటించింది. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆయనతో జత కట్టింది. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ఇందులో నటించిన వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.అయితే ఇప్పుడు త్రిష కెరీర్ సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలానే త్రిష తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తుంది.
లియో సినిమాకు త్రిష 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తుండగా, తర్వాతి సినిమాలకు 10 కోట్ల వరకూ డిమాండ్ చేసే అవకాశం ఉందట త్రిష. ప్రస్తుతం తమిళంలో అజిత్ జోడీగా నటిస్తుంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తోంది. వాటికి కూడా కోటి వరకు ఛార్జ్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. అయితే 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష ఆస్తులు కూడా భారీగా కూడబెట్టినట్టు తెలుస్తుంది. త్రిషకు చెన్నైలో చెన్నైలో 10 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉందని, అలానే హైదరాబాద్ లో కూడా త్రిషకు 6 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని, కొన్ని విలువైన ప్లాట్స్ కూడా ఉన్నాయని సమాచారం. ఇక త్రిష 80 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, 75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్, 60 లక్షల రేంజ్ రోవర్ కార్లు ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయని తెలుస్తుంది.ఆమెకి మొత్తం 90 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయని సమాచారం.