ఏంటి.. మోహ‌న్ బాబు అలాంటి వాడా..సెట్‌లో నాతో అలా ప్ర‌వ‌ర్తించాడంటూ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టిన వ‌కీల్ సాబ్ న‌టి

ఏంటి.. మోహ‌న్ బాబు అలాంటి వాడా..సెట్‌లో నాతో అలా ప్ర‌వ‌ర్తించాడంటూ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టిన వ‌కీల్ సాబ్ న‌టి

క‌లెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, విల‌న్‌గా ఆయ‌న ఎన్నో చిత్రాల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. మోహ‌న్ బాబు సినిమాల‌లో ఉన్న‌ట్టు బ‌య‌ట ఉండ‌రు. ఇండ‌స్ట్రీలో బాల‌య్య త‌ర్వాత ఆ రేంజ్ ఫైర్ మోహ‌న్ బాబులో ఉంద‌నే టాక్ న‌డుస్తుంటుంది. ఆయ‌న‌కి కోపం వ‌స్తే చెంప‌దెబ్బ కొట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. చిన్న ఆర్టిస్ట్‌లు మోహ‌న్ బాబుని చూసి గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంటారు. షూటింగ్ టైమ్ లో మోహ‌న్ బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. టైమ్‌ సెన్స్ పాటించే విషయంలో, సిన్సియర్ గా వర్క్ చేసే విషయంలో ఏదైన తేడా వ‌చ్చిందా మోహ‌న్ బాబు చేతిలో అయిపోయిన‌ట్టే..మోహన్‌బాబు ఆర్టిస్టులను కొడతారు అనే టాక్ కూడా చాలా కాలంగా ఉంది.

అయితే తాజాగా వ‌కీల్ సాబ్ న‌టి మోహ‌న్ బాబు బిహేవియ‌ర్ గురించి చెప్పి వార్త‌ల‌లో నిలిచింది. మోహ‌న్ బాబు వ‌ర్క్ ఎక్సీపీరియ‌న్స్ చేసిన ఆమె త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి తాజాగా వివ‌రించింది. వకీల్‌ సాబ్`లో లేడీ ఎస్‌ఐ పాత్రలో నటించిన లిరిశా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చింది. టీవీ సిరియ‌ల్స్ నుండి తను సినిమాలలోకి వ‌చ్చిన‌ట్టు చెప్పింది. ఇక చిన్నా, చిత‌కా పాత్ర‌లు పోషిస్తున్న త‌న‌కి మోహన్‌బాబు హీరోగా నటించిన పొలిటికల్‌రౌడీ మూవీలో హీరోయిన్‌ ఛార్మి ఫ్రెండ్‌ పాత్రలో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ట‌. ఆ ఛాన్స్ కమెడియన్‌ అలీ ద్వారా వ‌చ్చిందని కూడా పేర్కొంది.

అయితే సెట్స్‌కి వెళ్లినప్పుడు మొదట్లో మోహన్‌బాబుతో సీన్లు లేవట. ఆ తర్వాత ప్రకాష్‌ రాజ్‌, మోహన్‌బాబు సీన్లు పడ్డాయట. ఓ సీన్‌లో ప్రకాష్‌ రాజ్‌ తనని నెట్టేస్తే కింద పడాల్సి ఉంంటుంది. అయితే ఆ సీన్‌లో తాను ఎంత‌కు కింద ప‌డ‌లేక‌పోతుంద‌ట‌. దాంతో అంద‌రు విసిగిపోయారు. ఆ స‌మ‌యంలో మోహ‌న్ బాబు వ‌చ్చి షాట్‌ పెట్టమని చెప్పి, సైలెంట్‌గా వచ్చి తనని ఓ తోపు తోయ‌డంతో కింద ప‌డిపోయాను అని చెప్పింది లిరిషా. ఆ స‌మ‌యంలో త‌న చేతులు రాసుకుపోయాయ‌ట‌. అప్పుడు ఫ‌స్ట్ ఎయిడ్ చేశార‌ని పేర్కొంది. ఇక అనంత‌రం మోహ‌న్ బాబు త‌న ద‌గ్గ‌రు వ‌చ్చి ఎంతో బాగా చూసుకున్నార‌ని, మంచిగా యాక్టింగ్ నేర్చుకోవాల‌ని, అందుకు సంబంధించిన స‌ల‌హాలు కూడా ఇచ్చార‌ని వాపోయింది వ‌కీల్ సాబ్ న‌టి.