విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి యూట్యూబ్‌లో చెత్త కామెంట్స్.. వ్య‌క్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి యూట్యూబ్‌లో చెత్త కామెంట్స్.. వ్య‌క్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ అందిపుచ్చుకున్నాడు.ఆయ‌న సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే లైగ‌ర్ చిత్రంతో మంచి హిట్ కొట్టాల‌ని చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి నిరాశే ఎదురైంది. ఇటీవ‌ల ఖుషి చిత్రంతో కాస్త అల‌రించాడు.ప్ర‌స్తుతం విజయ్‌ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఫ్యామిలీ స్టార్‌ చిత్రీకరణ దశలో ఉంది. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

అయితే తాజాగా విజయ్‌ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్‌లో విజయ్‌కి సంబంధించి గౌరవాన్ని దెబ్బతీసేలా, పరువు నష్టం కలిగేలా ఓ వ్య‌క్తి ప్ర‌వ‌ర్తిస్తుండ‌డంతో ఈ విష‌యం పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి అనంతరపురానికి చెందిన వెంకట కిరణ్ గా గుర్తించారు.. సినీ పోలిస్‌ అనే యూట్యూబ్‌లో ఛానెల్‌లో తరచూ విజయ్‌ దేవరకొండపై అసభ్యకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండని, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానిస్తూ కూడా వీడియోలు చేశారు. దీంతో ఈ విషయం విజయ్‌ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు వెంకట కిరణ్‌ ఆచూకి కనిపెట్టింది. 2590/2023 గా కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. భ‌విష్య‌త్ లో అలాంటివి చేయ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు ఒక‌రు టార్గెట్‌గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది..