ఏంటి.. ఆ హీరో భార్య అలాంటి వ్యాధితో బాధపడుతుందా.. అందరు షాక్..!

వెండితెరపై ముద్దుముద్దుగా కనిపించే అందాల భామలు పలు రకాల వ్యాధులతో బాధపడుతుండడం అభిమానులని కలవరపరుస్తుంది. కొద్ది రోజుల క్రితం సమంత తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించగా, ఆ తర్వాత చాలా మంది తాము ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్‌లో హీరో వరుణ్ తేజ్ భార్య, నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ వితికా శేర్ కూడా చేరింది. ఆమె అనారోగ్యంతో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో తెలియజేసింది. ఇది విని ఆమె అభిమానులు అందరు అవాక్కవుతున్నారు.
వితికా పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తుంది. వరుణ్ సందేశ్, వితికాల కెరీర్ అంత సజావుగా సాగకపోయిన కూడా వైవాహిక జీవితంలో మాత్రం ఇద్దరు సంతోషంగా ఉన్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ జంట బిజినెస్ లు చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే వితికా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ వస్తుంది.
తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి, అందులో తనకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలియజేసింది. కొద్దిరోజులుగా స్పాండిలైటిస్ , మైగ్రేన్ వంటి వ్యాధితో బాధపడుతున్నట్టు పేర్కొంది. మైగ్రేన్ వల్ల విపరీతమైన తలనొప్పి వెన్నపోటు రావటం వల్ల తాను ఏ పని చేయలేకపోతున్నానని అలాగే స్పాండిలైటిస్ వ్యాధికి ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నట్టు పేర్కొంది. ఇక ఇటీవల నీడ్లింగ్ చేయించుకున్నానని కూడా వితిక పేర్కొంది. ఆ ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత తనకి కాస్త రిలీఫ్ గా ఉందని తెలియజేసింది. ఇప్పుడు తన పనులు తానే చేసుకుంటున్నట్టు స్పష్టంచేసింది. రెండు వారల నుండి మైగ్రేన్ తలనొప్పి తనని బాధపెడుతుందని పేర్కొంది. ఇలా అభిమానులతో తన బాధను వెల్లడించడం ద్వారా కాస్త రిలీఫ్ దక్కుతుందని వీడియోలో తెలియజేసింది