అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ మానేయ‌డానికి కార‌ణం ఇన్నాళ్ల‌కి బ‌య‌ట పడింది..రివీల్ చేసింది ఎవ‌రో కాదు..!

అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ మానేయ‌డానికి కార‌ణం ఇన్నాళ్ల‌కి బ‌య‌ట పడింది..రివీల్ చేసింది ఎవ‌రో కాదు..!

జ‌బ‌ర్ధ‌స్త్ షోకి యాంక‌ర్‌గా ప‌ని చేసిన అన‌సూయ తన గ్లామ‌ర్ షోతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. 2013లో ఈ షో మొద‌లు కాగా, అప్పుడు ఈ షోకి అన‌సూయ యాంక‌ర్‌గా ఉంది. త‌న క్యూట్ మాట‌లు, గ్లామ‌ర్ షో అంద‌రికి న‌చ్చేయ‌డంతో ఈ షోకి క్ర‌మ‌క్ర‌మంగా మంచి రేటింగ్ పెరుగుతూ పోయింది. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ షోతోనే అన‌సూయ‌కి మంచి క్రేజ్ ద‌క్కింది. పొట్టిబట్టల్లో ఆ షో వేదికగా సంచలనాలు చేసింది. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ షోకి యాంక‌ర్‌గా మారిన త‌ర్వాత అన‌సూయ చాలా బిజీ యాంక‌ర్ అయింది. ఆమెకి అనేక ఆఫ‌ర్స్ రావ‌డం, మెల్ల మెల్ల‌గా సినిమా అవ‌కాశాలు త‌లుపు త‌ట్ట‌డం కూడా జ‌రిగింది . ఇప్పుడు అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్స్ చిత్రాలలో కీలక రోల్స్ ఆమెకు దక్కుతున్నాయి.

అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్‌కి హోస్ట్‌గా ఉంటూనే సినిమాల‌లో కూడా న‌టిస్తూ వ‌చ్చింది. కాని 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలెనే జబర్దస్త్ మానేస్తున్నట్లు అనసూయ అప్పట్లో వివరణ ఇచ్చిన దాని వెన‌క మ‌రో కార‌ణం ఉంద‌ని చాలా మంది చెబుతున్న మాట‌. అయితే అనసూయ జ‌బ‌ర్ధ‌స్త్ మానేశాక ప‌లు ఇంట‌ర్వ్యూలలో సంచ‌లన ఆరోప‌ణ‌లు చేయ‌డం మ‌నం చూశాం. తన మీద జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, తాను కోప్పడినా దాన్ని ఎడిటింగ్ లో తీసేసేవారని అనసూయ అన్నారు. మరో సందర్భంలో టీఆర్పీ స్టంట్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది.

తాజాగా అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ షో మానేయ‌డానికి కార‌ణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ ఇంట‌ర్వ్యూలో హైప‌ర్ ఆదిని జోర్ధార్ సుజాత ..మీ కారణంగానే అనసూయ జబర్దస్త్ మానేశారనే వాదన ఉంది. దీనికి మీ సమాధానం ఏమిటి? అనగా… దానికి ఆది కాస్త సీరియ‌స్‌గా ఫేస్ పెట్టి ఏదో చెప్పాడు. అయితే ఇంట‌ర్వ్యూకి సంబంధించిన ప్రోమోలో అస‌లు విష‌యం రివీల్ చేయ‌లేదు. పూర్తి ఇంట‌ర్వ్యూ బ‌య‌ట‌కు వ‌స్తే కాని అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ మానేయ‌డానికి కార‌ణం ఏంట‌నేది తెలుస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో అయిన ఆది… అన‌సూయ మానేయడానికి కార‌ణం చెబుతాడా, లేదంటే ఏదో చెప్పి ఇంకా సస్పెన్స్ లో ఉంచుతాడా అనేది చూడాలి.