స‌లార్ మానియా.. ప్ర‌శాంత్ నీల్ సినిమాలు ఎందుకు అంత డార్క్‌గా ఉంటాయి..!

స‌లార్ మానియా.. ప్ర‌శాంత్ నీల్ సినిమాలు ఎందుకు అంత డార్క్‌గా ఉంటాయి..!

ఇప్పుడు ఎక్క‌డ చూసిన స‌లార్ మానియానే క‌నిపిస్తుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో ప్ర‌భాస్ హీరోగా, శృతి హాస‌న్ క‌థానాయికలుగా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా చూసేందుకు అభిమానులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరారు. అడ్వాన్స్ బుకింగ్ మొద‌లు కావ‌డంతో తొలి రోజే ఈ సినిమా చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ చాలా ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించాడు. ఆయ‌న తెర‌కెక్కించిన కేజీఎఫ్‌1,2 చిత్రాలు పెద్ద హిట్ కావ‌డంతో స‌లార్‌పై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అయితే స‌లార్ చిత్రం కేజీఎఫ్‌1,2 సినిమాల థీమ్ తో ఉండ‌డం.. అదే డార్క్ నెస్ కనిపించ‌డంతో ఆ సినిమాల‌కి ఏమైన లింక్ ఉంటుందా అని ప్రేక్ష‌కులు ముచ్చ‌టించుకుంటున్నారు.

అయితే అభిమానుల‌లో డార్క్ షేడ్ గురించి ప‌లు అనుమానాలు ఉండగా, దానికి ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. త‌న‌కి ఓసీడీ ఉంద‌ని అందుకే అలా తీస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం. రంగురంగుల చొక్కాలు ధరించడం నాకు ఇష్టం ఉండదు. నా మనసులో ఏముందో తెరపై అదే చూపిస్తాను. అది మంచి అయిన చెడు అయిన నో ప్రాబ్ల‌మ్ అంటున్నాడు. ప్ర‌శాంత్ నీల్ చెప్పిన‌దాని ప్ర‌కారం ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడేవారికి కొన్ని వ్యామోహాలు ఉంటాయి. దానివల్ల వారు ఒకే రకమైన పనులు, ఒకే రకమైన పద్దతిని ఎక్కువ‌గా ఫాలో అవుతూవుంటారు. అందుకే ప్ర‌శాంత్ నీల్ త‌న సినిమాల‌న్నింటిని కూడా అదే ప‌ద్దతిలో చేస్తూ వ‌స్తున్నాడు.

ఇక ‘కేజీఎఫ్ 2’ సినిమా ప్రభావం ‘సలార్’ సినిమాపై లేదని ప్రశాంత్ నీల్ గతంలోనే స్పష్టం చేశారు. రీసెంట్‌గా స‌లార్ ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. షారూఖ్ ఖాన్‌తో డంకీతో ఈ చిత్రం పోటీ ప‌డుతుంది. డిసెంబర్ 21న డంకీ విడుద‌ల కానుండగా స‌లార్ సినిమా 22న‌విడుదలవుతోంది. మ‌రి షారూఖ్ ఖాన్‌ని త‌ట్టుకొని హిందీలో ఎంత లాభాలు రాబడుతాడు అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక స‌లార్ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్ తదితరులు నటించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రన్ని నిర్మిస్తుండ‌గా, చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించారు.