Viral Video | గాఢ నిద్ర‌లో మామ‌.. నిప్పంటించేందుకు య‌త్నించిన మ‌హిళ‌

Viral Video | గాఢ నిద్ర‌లో మామ‌.. నిప్పంటించేందుకు య‌త్నించిన మ‌హిళ‌

Viral Video | గాఢ నిద్ర‌లో ఉన్న వృద్ధుడిని చంపేందుకు కోడ‌లు య‌త్నించింది. ముఖానికి ముసుగు ధ‌రించిన కోడ‌లు.. మామ నిద్రిస్తున్న బెడ్‌పైకి నిప్పును విసిరేసింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఓ వృద్ధుడు త‌న బెడ్‌పై గాఢ నిద్ర‌లో ఉన్నాడు. కోడ‌లు కిచెన్‌లో ఏదో ప‌ని చేసుకుంటూ ఉంది. అంత‌లోనే పేప‌ర్‌కు నిప్పంటించి, దాన్ని మామ నిద్రిస్తున్న బెడ్‌పైకి విసిరేసింది. అదృష్టావ‌శాత్తూ ఆ నిప్పు బెడ్‌కు అంటుకోలేదు. కింద ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి అరుస్తూ అక్క‌డికి చేరుకున్నాడు. అంత‌లోనే మామ కూడా నిద్ర లేచాడు.

ఇక ఈ దృశ్యాల్ని ఆ వ్య‌క్తి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించాడు. అయితే కోడలు ఏదో విష‌యంలో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. మామ‌ను స‌జీవ‌ద‌హ‌నం చేసేందుకు య‌త్నించి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

ఈ వీడియోను దీపికా నారాయ‌ణ్ భ‌ర‌ద్వాజ్ అనే ఎక్స్ యూజ‌ర్ తన ఖాతాలో షేర్ చేశారు. థ్యాంక్ గాడ్. ఇలాంటి భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న‌ల‌ను చిత్రీక‌రించేందుకు మొబైల్స్ ఉండ‌టం మంచి ప‌నైంది. లేదంటే భ‌ర్త‌లు న‌మ్మ‌క‌పోయేవారేమో. మామ‌కు నిప్పంటించేందుకు య‌త్నించిన మ‌హిళ మ‌నస్తాపానికి గురై ఉండొచ్చ‌ని ఆమె పేర్కొన్నారు.