Megastar Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి దర్శనం కావాలి..వీరాభిమాని దీక్ష!

విధాత, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి దర్శనం కావాలంటూ ఓ వీరాభిమాని ఏకంగా నిరహారదీక్షకు దిగిన వ్యవహారం వైరల్ గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయినిపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి చిరంజీవికి వీరాభిమాని. ఆయన చిరంజీవిని కలిసేందుకు అనేక సార్లు ప్రయత్నం చేశారట. కాని కుదరలేదంటున్నారు. దీంతో విసుగెత్తిన వీరాభిమాని రామకృష్ణ తన కోరికను చిరంజీవి వద్దకు చేర్చేందుకు నిరాహార దీక్ష మార్గం ఎంచుకున్నాడు. ఇంకేముంది ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇంతకు రామకృష్ణ తన అభిమాన నటుడు చిరంజీవిని ఎందుకు కలవాలనుకుంటున్నారో తెలుసుకుంటే మరింత ఆశ్చర్యం వేయకమానదు. ఆయన చిరంజీవి కోసం ఓ మంచి జానపద కథని రాశాడు. తను రాసిన కథను చిరంజీవికి వినిపించాలని ఆయన కొన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే తాను నిరహార దీక్షకు దిగినట్లుగా రామకృష్ణ వెల్లడించాడు.