Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్‌జీ బైక్‌ను పరిచయం చేయబోతున్న జజాజ్‌..!

Bajaj CNG Bike | దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్‌జీ మోటార్‌ సైకిల్‌ పరిచయం చేయబోతున్నది. ఈ ఏడాది జూన్‌ 18న బైక్‌ని లాంచ్‌ చేయనున్నది. ఈ విషయాన్ని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ కొత్త పల్సర్‌ ఎన్‌ఎస్‌ 400జడ్‌ బైక్‌ లాంచ్‌ చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరించారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ కావడం విశేషం. ప్రజలకు చౌక ప్రయాణాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు.

వాస్తవానికి బజాజ్‌ సీఎన్‌జీ బైక్‌ బైక్‌కు సంబందించి వివరాలను ఇప్పటి వరకు కంపెనీ వెల్లడించలేదు. అయితే, భారీగానే లీక్స్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఈ బైక్‌లో డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్‌ని సూచించే భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందని సమాచారం. ఇది 100-125 సీసీ ఇంజిన్‌ రావొచ్చని.. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, బ్యాక్‌ సైడ్‌లో మోనోషాక్, డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటాయనే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సింగిల్ ఛానల్ ఏబీఎస్‌ లేదంటే కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ ఉండవచ్చని సమాచారం. కొత్త బైక్‌కు ఇప్పటి వరకు ఏం పేరు పెట్టారో బజాజ్‌ అధికారికంగా ప్రకటించలేదు.

కానీ, ఇటీవల బ్రూజర్‌ పేరును ట్రేడ్‌ మార్క్‌ చేసుకుంది. సీఎన్‌జీ మోటార్‌ సైకిల్‌ పేరుకావొచ్చని భావిస్తున్నారు. తొలి సీఎన్‌జీ బైక్ భవిష్యత్తుల్లో మరిన్ని సీఎన్‌జీ బైక్స్‌ వచ్చేందుకు దారి తీస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బజాజ్‌ ఆటో ఇటీవల ఫ్లాగ్‌ షిప్‌ పల్సర్‌ని లాంచ్‌ చేసింది. పల్సర్ ఎన్ఎస్400జెడ్‌ మోడల్‌ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.85 లక్షలు. రూ.5వేల టోకెన్ మొత్తం చెల్లించి బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. జూన్ నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.