Budget 2024 | పన్నుల విధానంలో కీలక మార్పులు.. ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేసిన కేంద్రం.. రూ.3లక్షల వరకు పన్ను ఉండదు..!
Budget 2024 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు, ఉద్యోగులను ఊరట నిచ్చింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రకటన చేస్తూనే ఈ సారి ఆర్థిక మంత్రి కొత్త పన్ను విధానంలో రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 5శాతం మాత్రమే పన్ను విధించనున్నట్లు ప్రకటించారు.

Budget 2024 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు, ఉద్యోగులను ఊరట నిచ్చింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రకటన చేస్తూనే ఈ సారి ఆర్థిక మంత్రి కొత్త పన్ను విధానంలో రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 5శాతం మాత్రమే పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో నాలుగు కోట్ల మందికి ఊరట కలుగనున్నది ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే, పాత ఆదాయపు విధానంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు కానీ.. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేసింది. కొత్త పన్ను విధానంలో, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెరిగింది. రూ.10 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ప్రయోజనం పొందనున్నారు. ఇక రూ.3లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.
కొత్త విధానంలో రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు, రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకు 10శాతం, రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు 15శాతం, రూ.13లక్షల నుంచి రూ.15లక్షల వరకు 20శాతం, రూ.15లక్షలు ఆపై ఆదాయానికి రూ.30శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి మారే దిశగా చర్యలు తీసుకోన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. స్వచ్ఛంద సంస్థల విషయంలో, రెండు వేర్వేరు పాలనలకు బదులుగా ఒక పన్ను మినహాయింపు ఉండనున్నది. వివిధ చెల్లింపుల కోసం 5శాతం టీడీఎస్‌కు బదులుగా రెండు శాతం టీడీఎస్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, యూటీఐని తిరిగి కొనుగోలు చేయడంపై 20 శాతం టీడీఎస్‌ను ఉపసంహరించింది.
ఈ – కామర్స్ ఆపరేటర్లకు టీడీఎస్‌ను ఒకశాతం నుంచి 0.1శాతానికి తగ్గించింది. పన్నుల పరిష్కారానికి జన్ విశ్వాస్ 2.ఓ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొంది. ఇక ఆరు నెలల్లో ఆదాయపు పన్ను చట్టాన్ని సమీక్షించనున్నట్లు తెలిపారు. అన్ని కేటగిరిల పన్ను చెల్లింపుదారులకు ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, గతంలో ఆర్థిక మంత్రి పాత పన్ను డిమాండ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. 1962 నుంచి కొనసాగుతున్న అన్ని పాత పన్ను వివాదాల నుంచి 2009-10 సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న ప్రత్యక్ష పన్ను డిమాండ్లకు (డిమాండ్ నోటీసులు) సంబంధించిన రూ.25,000 వరకు వివాదాలను ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్లు మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదేవిధంగా 2010-11 నుంచి 2014-15 మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రత్యక్ష పన్ను డిమాండ్లకు సంబంధించి రూ.10వేల వరకు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.
స్టార్టప్‌లు, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారికి పన్ను ప్రయోజనాల గడువును 31 మార్చి 2024 నుంచి 31 మార్చి 2025 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టే వారికి అదనపు పన్ను ప్రయోజనం పొందేందుకు మార్గం సుగమమైంది. గత పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఈ కాలంలో పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని.. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారులు పన్ను వాపసు పొందడానికి తీసుకునే సమయం తగ్గిందని ఆర్థిక మంత్రి చెప్పారు. గతంలో సగటున 93 రోజులు పట్టేదని, ప్రస్తుతం దాన్ని 10 రోజులకు తగ్గించారు. ఆర్థిక మంత్రి తాజాగా తన బడ్జెట్ ప్రసంగంలో పన్నులను దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వివేకంతో పన్నుల పన్ను చెల్లింపుదారులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో తాము పన్ను చెల్లింపుదారులకు సేవలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు.