BOI: కస్లమర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు

  • By: sr    business    Apr 17, 2025 11:29 AM IST
BOI: కస్లమర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు

ముంబై, ఏప్రిల్ 14, 2025:దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా, గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కొత్త, పాత కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చింది. ఈ సవరణతో గృహ రుణ వడ్డీ రేటు సిబిల్ స్కోరు ఆధారంగా సంవత్సరానికి 8.10% నుంచి 7.90%కి తగ్గింది. ఇంటి సొంతం కలను నెరవేర్చడం, కస్టమర్ల ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడటం ఈ చర్య ఉద్దేశం. సవరించిన రేట్లు 2025 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.

గృహ రుణాలతో పాటు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రిటైల్ రుణ ఉత్పత్తులైన వాహన, వ్యక్తిగత రుణం, ఆస్తికి వ్యతిరేకంగా రుణం, విద్యా రుణం, స్టార్ రివర్స్ మార్ట్‌గేజ్ రుణం వంటి వాటిపై కూడా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అనుకూల మార్కెట్ పరిస్థితుల ప్రయోజనాలను కస్టమర్లకు అందించడం, పోటీతత్వం, కస్టమర్ స్నేహపూర్వక రుణ పథకాలను కొనసాగించేందుకు మొగ్గు చూపింది.