RBI News Rules | రుణాలపై అదనపు ఛార్జీలను ఇక బ్యాంకులు దాచలేవు..! కొత్త రూల్‌ తీసుకువచ్చిన ఆర్‌బీఐ..!

RBI News Rules | రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. మీకు ఏదైనా బ్యాంకులో లోన్‌ ఉన్నా.. మీరు ఏదైనా పని కోసం లోన్‌ తీసుకోవాలనుకుంటునట్లయితే ఆర్‌బీఐ నిర్ణయం ఉపయోగకరంగా ఉండనున్నది. ప్రస్తుతం బ్యాంకుల ఖాతారుల నుంచి రుణాలపై వివిధ ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఆయా ఛార్జీలను ఎందుకు వసూలు చేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా స్టేట్‌మెంట్‌లో తెలియజేయాల్సిందేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

RBI News Rules | రుణాలపై అదనపు ఛార్జీలను ఇక బ్యాంకులు దాచలేవు..! కొత్త రూల్‌ తీసుకువచ్చిన ఆర్‌బీఐ..!

RBI News Rules | రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. మీకు ఏదైనా బ్యాంకులో లోన్‌ ఉన్నా.. మీరు ఏదైనా పని కోసం లోన్‌ తీసుకోవాలనుకుంటునట్లయితే ఆర్‌బీఐ నిర్ణయం ఉపయోగకరంగా ఉండనున్నది. ప్రస్తుతం బ్యాంకుల ఖాతారుల నుంచి రుణాలపై వివిధ ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఆయా ఛార్జీలను ఎందుకు వసూలు చేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా స్టేట్‌మెంట్‌లో తెలియజేయాల్సిందేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అక్టోబర్‌ ఒకటి నుంచి రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ లోన్‌లు తీసుకునే కస్టమర్లకు వడ్డీ, ఇతర ఖర్చులతో సహా రుణం మొత్తం సమాచారాన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించాల్సిందేనని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలిచ్చింది. ఇందు కోసం ఆర్‌బీఐ ఏఎఫ్‌ఎస్‌ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌ రూల్‌ని రూపొందించింది. ఈ కేఎఫ్‌ఎస్‌ అంటే ఏంటో తెలుసుకుందాం రండి..!

ఎందుకీ నిర్ణయం ?

రుణాల కోసం కేఎఫ్‌ఎస్‌ సూచనలను సమన్వయం చేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. పారద్శకతను పెంచడానికి, ఆర్‌బీఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల ఉత్పత్తులకు సంబంధించిన సమాచార లోపాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో రుణగ్రహీత ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోగలుగుతారని పేర్కొంది. ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్ని అన్ని సంస్థలు ఇచ్చే రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ టర్మ్‌ లోన్ల విషయంలో సూచనలు వర్తిస్తాయని పేర్కొంది. కేఎఫ్‌ఎస్‌ అనేది సాధారణ భాషలో రుణ ఒప్పందం కీలక వాస్తవాల ప్రకటన. ఇది ప్రామాణిక ఆకృతిలో రుణగ్రహీతలకు అందించబడుతుంది. ఆర్థిక సంస్థలు వీలైనంత వరకు త్వరగా మార్గదర్శకాలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. 1 అక్టోబర్‌ 2024 తర్వాత మంజూరైన అన్ని కొత్త రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ టర్మ్‌ లోన్ల విషయంలో మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుందని.. ఇది ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఇచ్చిన కొత్త రుణాలకు సైతం వర్తిస్తుందని పేర్కొంది.

థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్

రుణం తీసుకునే సంస్థల నుంచి థర్డ్‌ పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్ల తరఫున సెంట్రల్‌ బ్యాంక్‌ పరిధిలోకి వచ్చే సంస్థలు సేకరించి బీమా, లీగల్‌ ఫీజులు వంటి మొత్తాలు కూడా వార్షిక శాతం రేటు (APR)లో భాగంగా ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులు లోన్ స్టేట్‌మెంట్‌ ఫీజులకు సంబంధించిన వివరాలు పొందుపరుస్తూ వస్తున్నాయి. ఆర్బీఐ నూతన మార్గదర్శకాల ద్వారా ఒక కీలక విషయం లోన్ స్టేట్‌మెంట్‌లో కనిపించనున్నది. అదే యాన్యువల్‌ పర్సంటేజ్‌ రేట్‌ (APR). ఇది రుణగ్రహీత లో‌న్‌కు వార్షిక ఖర్చును తెలియజేస్తుంది. ఇందులో వడ్డీ రేటుతో పాటు ఇతర ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇన్సూరెన్స్, లీగల్ ఛార్జీలు వంటి థర్డ్‌ పార్టీ సర్వీసుల కోసం వసూలు చేసే రుసుములను కూడా ఏపీఆర్‌లో ప్రత్యేక కాలమ్‌లో పొందుపరచాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఏపీఆర్ ద్వారా ఏఏ బ్యాంకులో లోను రుసుములు ఎంత ఉన్నాయో కస్టమర్‌కు సులభంగా అర్థమవుతుందని ఆర్‌బీఐ వెల్లడించింది. లోన్లలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2015 నుంచి ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంటున్నది. అలాగే, కేఎఫ్‌ఎస్‌లో పేర్కొనని అలాంటి ఛార్జీల్లో క్రెడిట్‌కార్డు ఒకటి, రుణగ్రహీత స్పష్టమైన సమ్మతి లేకుండా కార్డు కాలవ్యవధిలో ఏ దశలోనూ ఇలాంటి ఛార్జీలు విధించబడవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.