Allu Arjun|అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నాడుగా.. మెగా ఫ్యామిలీపై మళ్లీ సెటైర్ వేసాడా..!
Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్నాళ్లుగా వివాదాలతో వార్తలలో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వెళ్లకుండా స్వయంగా ప్రత్యర్థి పార్టీకి ప్రచారంగా నంద్యాల వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్నాళ్లుగా వివాదాలతో వార్తలలో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వెళ్లకుండా స్వయంగా ప్రత్యర్థి పార్టీకి ప్రచారంగా నంద్యాల వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు. దీనిని మెగా ఫ్యాన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ వంటి వారు అయితే దీనిపై కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బన్నీపై ఇన్‌డైరెక్ట్‌గా తన అసహనం వ్యక్తం చేశాడని అన్నారు. బన్నీ చేసిన పనితో రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చింది. ఇష్యూ సీరియస్‌గానే ఉందని అర్థమయింది.
ఒకవైపు బన్నీ గురించి ఇండస్ట్రీలో అన్ని ప్రచారాలు జరుగుతున్నా కూడా ఏనాడు స్పందించింది లేదు. అయితే తాజాగా `మారుతీనగర్ సుబ్రమణ్యం` ఈవెంట్‌కి హాజరైన బన్నీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకు తబిత ఫోన్ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందని చూసించాడు. నిజానికి ఆ సమయంలో తాను చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నాడట. `పుష్ప 2` క్లైమాక్స్ షూట్ జరుగుతుందని, అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, టైరింగ్ క్లైమాక్స్. రాలేని పరిస్థితి అని, కానీ తబిత ఉండి.. నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను, నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడగగడంతో ఆ మాట కోసం తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్.
ఇష్టమైన వాళ్ల కోసం మనం ఇష్టం చూపించాలి కదా, మన ఫ్రెండ్ అనుకో, మనకు కావాల్సిన వాళ్లు అనుకో, నాకిష్టమైతే నేనొస్తా. నా మనసుకి నచ్చితే నేనొస్తా, వారి కోసం మనం నిలబడాలి అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. అంటే తనని విమర్శించేవారికి బన్నీ ఈ రకంగా కౌంటర్ ఇచ్చాడని కొందరు అంటున్నారు. తనకి ఇష్టమైతే ఎవరి దగ్గరికైన వెళతా అని బన్నీ క్లారిటీ ఇచ్చాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మానిపోతున్న పుండుపై కారం చల్లినంత పనైంది. మరి ఇది ఇంకా ఎంత వివాదానికి దారి తీస్తుందో చూడాలి.